Special Story Current Shock Death in Telangana : ప్రకృతి కరుణిస్తే నాలుగు గింజలు. కన్నెర్ర చేస్తే నష్టాలు. కష్టం బారెడు దక్కేది మూరెడు. అడుగడుగునా సవాళ్లు, బతుకంతా కష్టాలు. ఇన్ని మాటలూ అన్నం పెట్టే రైతన్నల గురించే. ఇవి చాలవు అన్నట్లు రాష్ట్రంలో రైతులకు విద్యుత్ ప్రమాదాలు మరో పెను సమస్యగా మారాయి. పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. వ్యవసాయ పనులు చేసేటప్పుడు పొరపాటున చూసుకోకుంటే పొలాల్లోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఒకటా రెండా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.
2023 జులై నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 17 రోజుల వ్యవధిలో విద్యుత్ ప్రమాదాల కారణంగా 9మంది రైతులు మృత్యువాత పడ్డారు. ఇదే ఏడాది జులైలోనే సూర్యాపేట జిల్లాలో ఓ రైతు తన పొలానికి విద్యుత్ తీగలు లాగుతుండగా పైనున్న 11కేవీ వైర్లు తగిలి మృత్యువాత పడటంతో అతని భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. 2023 మార్చిలో నిజామాబాద్ జిల్లాలో పెరికిట్లో ఫీడర్ మార్చిన విషయం తెలియని లైన్మెన్ ఎల్సీ తీసుకున్నానని ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజులు వేసేందుకు వెళ్లగా ప్రమాదానికి గురై మంచానికి పరిమితమయ్యారు.
Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు
Nizamabad Current Shock Death : నిజామాబాద్ జిల్లాలో గత ఏడాదిలో విద్యుత్ ప్రమాదాల కారణంగా 21 మంది చనిపోగా మరో 23 మంది గాయపడ్డారు. అలాగే 57 పశువులు మృత్యువాత పడ్డాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల కారణంగా 16 మంచి చనిపోగా 50 జంతువులు మృతి చెందాయి. ప్రతి ఏడాది జిల్లాలో సగటున ప్రతి ఏడాది 20 మంది మృత్యువాత పడుతున్నారు. మరణించిన వారిలో 90శాతానికి పైగా రైతులే ఉంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా విద్యుత్ ప్రమాదాల బెడద తీవ్రంగానే ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు తీగల నిర్వహణ సరిగా లేదు. అనేక గ్రామాల్లో విద్యుత్తు తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. విద్యుత్ సిబ్బంది నిర్వహణ లోపమే దీనికి కారణం. నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో పొలాల్లో విద్యుత్వైర్లు వేసి చాలా కాలమైంది. ఏళ్ల కిందట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ వైర్లు వేలాడటం వల్ల పొలాల్లోకి ట్రాక్టర్లు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిదని రైతులు అంటున్నారు
Problems with Dharani Website : అన్నదాతలను అరిగోస పెడుతున్న 'ధరణి లోపాలు'
విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు వసూలుపై చూపుతున్న శ్రద్ద ప్రమాదల నివారణపై చూపటం లేదని రైతు సంఘం నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లకు త్వరగా మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నా, తీగలు వేలాడుతున్నా తమకు తెలియజేయాలని అధికారులు అంటున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాన్నమని తెలిపారు
రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో కరెంటు సరఫరా కావడంతో పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. సర్వీస్ వైర్లు, వీధి దీపాలను సరిచేసేందుకు విద్యుత్ స్తంభాలు ఎక్కినప్పుడు కరెంటు సరఫరా జరిగి మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలే కొనసాగుతున్నాయి. ప్రమాదాలకు ఇది ప్రధాన కారణం. పలు ప్రాంతాల్లో ఎర్త్ వైర్లు ఇష్టారాజ్యాంగా ఉంటున్నాయి. ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచెలు లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ వైర్లు గాలి దుమారానికి తెగిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడం కూడా ప్రమాదాలకు మరో కారణం.
Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు
Government Compensation to Shock Death Families : విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, మూగ జీవాలకు రూ.40 వేలు పరిహారంగా అందజేస్తోంది. అయితే అది శాఖాపరమైన నిబంధనల ప్రకారం ఉంటేనే. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. రాష్ట్రంలో రైతులు రబీ సీజన్ కోసం సిద్ధమయ్యారు. నాట్లు వేసే సమయం కావడంతో విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల జరగకుండా పంపిణీ సంస్థలు రైతులకు అవగాహన కల్పించాలి. తరచూ మరణ మృదంగం వినిపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది లోపాలు ఎక్కడున్నాయో తక్షణమే గుర్తించి సరిదిద్దాలి. పొలాలతో పాటు ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లలోని సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్టపడుతుంది
Bhoothpur Village Story : భూత్పూర్ వాసుల క'న్నీటి' గోస.. ఎవరికీ పట్టడం లేదా..?