ETV Bharat / state

మూడో విడత రుణమాఫీ డబ్బులు అందని వారికి గుడ్​న్యూస్​ - సర్కారు సరికొత్త నిర్ణయం! - crop loan waiver - CROP LOAN WAIVER

Telangana Special Drive For Non Loan Farmers : మూడో విడత రైతు రుణమాఫీ డబ్బులు శుక్రవారం నుంచి జమవుతున్నాయి. అయితే, కొంతమంది రైతులకు రుణమాఫీకి అన్ని అర్హతలున్నా.. వారి అకౌంట్లలో డబ్బులు జమ కావట్లేదు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..

Farmers
Telangana Special Drive For Non Loan Farmers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:19 PM IST

Special Drive For Non Loan waivers : మూడో విడత రుణమాఫీని.. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం నుంచి చాలా మంది రైతుల ఖాతాల్లో ఇందుకు సంబంధించి నిధులు జమవుతున్నాయి. అయితే, మరికొంతమందికి రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి.. కూడా అకౌంట్లలో డబ్బులు పడడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. అర్హతలున్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రుణమాఫీకి అన్ని అర్హతలున్నా.. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. అవేంటంటే.. రేషన్​ కార్డులు లేకపోవడంతో ఫ్యామిలీ నిర్ధారణ కాకపోవడం, ఆధార్​ కార్డులో తప్పులు, బ్యాంక్​ - ఆధార్​ వివరాల్లో తేడాలు, పట్టాదారు పాస్​ పుస్తకం లేకపోవడం, అసలు-వడ్డీ లెక్కల్లో తేడాల కారణంగా చాలా మందికి రుణమాఫీ కాలేదు. అయితే, వీరికి న్యాయం చేయడానికి ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ జులై 15న జారీచేసిన జీవో నంబరు 567కు అనుబంధంగా రాష్ట్ర శుక్రవారం ఒక సర్క్యులర్‌ జారీచేసింది.

ఇందులో ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు, సూచనలు చేసింది. స్పెషల్​ డ్రైవ్​ బాధ్యతలను మండల వ్యవసాయ అధికారులకు (ఎంఏవో) అందజేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కానీ వారి ఇంటికి వెళ్లి తప్పులను సరి చేసి క్రాప్‌ లోన్‌ వీవర్‌ (సీఎల్‌డబ్ల్యూ) పోర్టల్‌ లో అప్​లోడ్​ చేస్తారు. డైలీ సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి, మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య, రోజువారీ నివేదిక అందిస్తారు. ఆధార్​ కార్డులో ఏమైనా తప్పులుంటే.. రైతుల వద్దకు వెళ్లి ఆధార్​ తీసుకుని, పోర్టల్​లో సరైన కాపీని అప్​లోడ్​ చేస్తారు.

ఓటరు కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, రైతు రేషన్‌ కార్డు వంటి ఇతర గుర్తింపు పత్రాలను రైతుల నుంచి సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఒకవేళ రేషన్‌ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోతే.. మండల వ్యవసాయ అధికారి రైతుల ఇంటికి వెళ్లాలి. రైతు తెలిపిన కుటుంబ వివరాలను నిర్ధారించి పోర్టల్ అప్​లోడ్​ చేయాలి. ఒకవేళ రైతుకు పట్టాదారు పాస్‌బుక్‌ లేదని పోర్టల్‌లో చూపిస్తే.. రైతు దగ్గర నుంచి పట్టాదారు పాస్‌బుక్‌ తీసుకొని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

అలాగే ఆధార్​ కార్డులోని పేరు, లోన్​ ఖాతాలోని పేరులో తేడాలుంటే.. అధికారులు రైతుని గుర్తించి, లోన్ తీసుకున్న వ్యక్తి ఆధార్​ నెంబర్​ను పోర్టల్​లో అప్​లోడ్ చేయాలి. తీసుకున్న రుణం, వడ్డీ మొత్తంలో తేడాలొస్తే.. రైతు నుంచి దరఖాస్తు తీసుకోవాలి. రుణం ఎంత తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? వడ్డీ ఎంత అయింది? అసలు- వడ్డీ కలిపి మొత్తం ఎంత అనే వివరాలను పేర్కొంటూ పోర్టల్‌లో అధికారులు అప్‌లోడ్‌ చేయాలి. తప్పులను సరిదిద్దమని సంబంధిత బ్యాంకులకు వివరాలను పంపించాలి.

రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారికి నాలుగో విడతలోనే!

రుణమాఫీలో భాగంగా రూ.2 లక్షలకుపైగా ఉన్నవారికి నాలుగవ విడతలో రుణమాఫీ చేస్తారని సమాచారం. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు.. ఆ ఎక్కువ మొత్తాన్ని మొదట రైతులు చెల్లించాలి. ఆ తర్వాత గవర్నమెంట్​ రూ.2 లక్షలను మాఫీ చేస్తుంది. అయితే, రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని ఎప్పటిలోగా చెల్లించాలి? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

మూడో విడత రుణమాఫీ - వారి అకౌంట్లలో మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి!

ఒక్క రైతుతో చెప్పించినా రాజకీయాలు వదిలేస్తా - సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.