ETV Bharat / state

డీయాక్టివేట్​ అవుతున్న ఆధార్​​ కార్డులు - మీ సంగతేంటో చెక్​ చేసుకోండి - Aadhar cards deactivated

Some Aadhaar Cards are Deactivated in Telangana : సాంకేతిక కారణాలు, ఇతరత్రా సమస్యలతో పలు ప్రాంతాల్లో ఆధార్​ కార్డులు డీయాక్టివేట్​ అవుతున్నాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అప్​డేట్​ చేయడానికి వెళితే డీయాక్టివేట్​ అయినట్లు చూపిస్తున్నాయని లబోదిబోమంటున్నారు. ఈ విషయాలు భూముల రిజిస్ట్రేషన్​ తదితర సందర్బాల్లో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా తెలంగాణలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో మిగతా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.

Some Aadhaar Cards are Deactivated in Telangana
Some Aadhaar Cards are Deactivated in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 4:22 PM IST

Some Aadhar Cards Deactivate in Telangana : ప్రస్తుత కాలంలో ఆధార్​ కార్డు లేనిదే ఏ పనీ కావడం లేదు. వయసు ధ్రువీకరణ పత్రం, భూములు రిజిస్ట్రేషన్లు ఇలా చాలా వాటికి ఆధార్​ కార్డే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆధార్​ కార్డులో సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్​లైన్​లో చెక్​ చేస్తే అవి డీయాక్టివేట్​ అయినట్లు చూపించడమే ఇందుకు కారణం. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి వాటిని యాక్టివేట్​ చేయించుకునే ప్రక్రియలో గందరగోళానికి గురవుతున్నారు.

అయ్యో 'రామా'! అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ స్వామి భక్తి- స్పీకర్​నే ఏమార్చే యత్నం! - Ban on news channels

చదువుకున్న వారు అయితే డీయాక్టివేట్​ అయిన దాన్ని ఎలాగోలా యాక్టివేట్​ చేసుకుంటారు. కానీ చదువురాని వారు యాక్టివేట్​ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, మహబూబ్​నగర్​ తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆధార్​ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే అప్​డేట్​ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్​ కేంద్రాలకు వెళ్లి అప్​డేట్​ చేసుకుంటే, డీయాక్టివేట్​ అయినట్లు చూపిస్తున్నాయి. అలాగే ఆస్తుల రిజిస్ట్రేషన్​ తదితర సందర్భాల్లో ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి.

ఆధార్​ కార్డు డీయాక్టివేషన్​కు ప్రధాన కారణాలు :

  • ఆధార్​ కార్డుల జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో వయసు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్​ కార్డులు డీయాక్టివేట్​ అవుతున్నాయి.
  • డీ యాక్టివేట్​ అంటే మన దగ్గర ఆధార్​ కార్డు ఉన్నా, అందుకు సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో చూపించవు.
  • ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్​, నిర్మల్​, జగిత్యాల, ఆదిలాబాద్​ జిల్లాల బీడీ కార్మికుల పీఎఫ్​ కోసం వయసు సవరణలకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఆధార్​లు డీయాక్టివేట్​ అయ్యాయి.
  • ఆధార్​ కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలి ముద్రల బదులు వారివి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్​ను అప్​డేట్​ చేసుకున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్​ అవుతున్నాయి.
  • కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన సాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయనకు మొదటి నుంచి అసలు ఆధార్​ కార్డే లేకుండా పోయింది. ఆయన కుమారుడి కార్డు అప్​డేట్​ చేయబోతే అది డీయాక్టివేట్​ అయిపోయింది. దీనికి సంబంధించి ప్రాంతీయ కార్యాలయంలో 40 సార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

ఏళ్ల నుంచి తహసీల్దార్‌ లాగిన్‌లలో : తహసీల్దార్​ లాగిన్​లలో ఏళ్ల తరబడి ఆధార్​ రీజినల్​ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాల నిర్ధారణకు అది తహసీల్దార్​ లాగిన్​కు అర్జీలను పంపుతుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో చాలాచోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్​ లాగిన్​ తెరిచి వెరిఫికేషన్​ చేయటం లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్​ లాగిన్​లలో అవి పెండింగ్​లో ఉన్నాయి.

సరైన పత్రాలు లేవని వెనక్కి పంపుతున్నారు : హైదరాబాద్​లోని మైత్రివనంలో ఆధార్​కార్డుల పునరుద్ధరణ కోసం ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారం రోజుల తర్వాత సరైన పత్రాలు లేవని లేఖ పంపిస్తున్నారు. దాంతో ప్రాంతీయ కార్యాలయంలో వివరణ ఇచ్చేవారే కరవు అయ్యారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రజావాణిలో అర్జీ చేసుకున్నా, ఇంకా తన సమస్య పరిష్కారం కాలేదని ఓ బాధితుడు వాపోయాడు. జిల్లాస్థాయిలో పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

కోర్టు ఆదేశాలతోనే వైఎస్సార్​సీపీ ఆఫీస్ కూల్చివేత- సీఆర్డీఏ - Demolition of YSRCP office

దేవుడి స్క్రిప్ట్​తోనే వైఎస్సార్​సీపీ 11 సీట్లు- పిరికితనంతో జగన్ పారిపోయాడు: చంద్రబాబు - CM Chandrababu on YSRCP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.