Solar In Karimnagar Womens Government College : కరీంనగర్ మహిళా కళాశాల యాజమాన్యం విద్యుత్ బిల్లు నెలకు వేలల్లో చెల్లించాల్సి వచ్చేది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కళాశాల యాజమాన్యం విద్యుత్ బిల్లు తగ్గించే దిశగా సోలార్ విద్యుత్ వైపు దృష్టి సారించారు. దీనికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిధులు కేటాయించడంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్తు బిల్లు ఆదా చేస్తున్నారు.
హైదరాబాద్ సిగలో మరో అద్భుతం... పొడవైన సోలార్ బై సైకిల్ ట్రాక్
Solar Power In College : కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల 7 బ్లాక్‌లు, 76 తరగతి గదులు, 2,500 మంది విద్యార్థులతో సువిశాలమైన వాతావరణంలో విస్తరించి ఉంది. కళాశాలలో పెద్ద మెుత్తంలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు వినియోగిస్తుండటంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లు తడిసి మోపెడయ్యేది. ప్రతి నెల బిల్లు చెల్లించడానికి సరైన బడ్జెట్ అందుబాటులో లేకపోవడంతో కళాశాల యాజమాన్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేది. ఈ విద్యుత్తు భారాన్ని తగ్గించుకునేందుకు కళాశాల యాజమాన్యం బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహకారంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ కళాశాల విద్యుత్ బిల్లు భారీగా తగ్గిపోయిందని కళాశాల ప్రిన్స్‌పల్ శ్రీలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను మా కాలేజ్‌కి సోలార్ ప్లాంట్ కావాలని అడిగితే వెంటనే ఆర్థిక సాయం చేశారు. మా కళాశాలలో 7 బ్లాక్‌లు ఉన్నాయి. 76 తరగతి గదులు ఉన్నాయి. 2500 మంది విద్యార్థులతో చాలా పెద్ద కళాశాల. ఇంత పెద్ద కాలేజ్ కావడం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో కరెంటు బిల్లు వస్తూ ఉండేది. ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి నెల రూ.50 వేలు వచ్చే కరెంటు బిల్లు ఈసారి రూ.6 వేల లోపు వస్తుంది. న్యాక్ లో కూడా కాలేజీకి మంచి స్కోరు వచ్చింది. న్యాక్ గ్రేడ్‌లో ఏ గ్రేడ్ సాధించాము." - శ్రీలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్
Bandi Sanjay : ప్రస్తుత కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. విద్యుత్తు అధిక శాతం బొగ్గుతో ఉత్పత్తి అవుతుండటంతో వాతావారణ కాలుష్యం తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో సోలార్ విద్యుత్ సదుపాయం కోసం కళాశాల యాజమాన్యం ఎంపీని ఆశ్రయించారు. అడిగిన వెంటనే బీజేపీ నాయకులు బండి సంజయ్ ఆర్థిక సహాయం చేశారని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు తమకు విద్యుత్ సమస్య తీరిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.
300 యూనిట్ల ఫ్రీ కరెంట్- ఏటా రూ.18 వేలు ఆదా- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!