Snake Stuck in a Bike In Suryapet District : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పాము సుమారు అరగంట పాటు ట్రాఫిక్ ఆపేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న రాఘవేంద్ర సూపర్ మార్కెట్‌కు ఓ వ్యక్తి సరుకులు కొనడానికి వచ్చాడు. కాసేపటి తరువాత వేగంగా వచ్చిన ఓ పాము, సూపర్ మార్కెట్ ముందు పార్క్ చేసిన ఆ బైక్‌లోకి దూరింది. ఇది గమనించిన స్థానికులు బైక్ ఓనర్‌కు సమాచారమిచ్చారు. బైక్ ఓనర్, మరికొందరు పామును బయటకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. రాత్రి కావడం, చీకటి వల్ల పాము సరిగా కనిపించలేదు. చివరకు బైక్ సీట్‌తో సహా మొత్తం విప్పిన తరువాత పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది.
బైక్ పైనుంచి కిందకు దూకి పాము వేగంగా పారిపోతుండటంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాని తలపై కొట్టడంతో చనిపోయింది. మొత్తం ఈ ఎపిసోడ్ సుమారు అరగంట పాటు సాగింది. బైక్ సీట్ తొలగించడం, అందరూ సెల్‌ఫోన్ లైట్లతో పాము కోసం చూస్తుండటంతో రోడ్డుపై వెళ్తున్న వారు కూడా గుమిగూడారు. దీంతో ఆ రూట్లో కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. పామును చంపిన తరువాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రా : ఇటీవల ఒడిశా మయూర్భంజ్ జిల్లా బంగ్రా గ్రామంలోనూ ఇలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. ఉడుమును తరుముతూ 11 అడుగుల కింగ్ కోబ్రా ఓ ఇంట్లోకి చొరబడింది. గ్రామంలోని ఓ ఇంట్లో 6.7 కిలోల బరువున్న పామును చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న దుల్కా వైల్డ్‌లైఫ్ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది, పామును పట్టుకున్నారు. దానిని స్థానిక వెటర్నరీ వైద్యుడు పరిశీలించిన తర్వాత సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందని స్థానికులు చెప్పారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
బైక్ స్పీడో మీటర్లోకి దూరిన పాము
Baby Snake: గంటసేపు అందరినీ ఆగం చేసిన పాముపిల్ల.. చిక్కినట్టే చిక్కి..!