Snake Found in Scooter : చాలా మందికి పాములంటే చాలా భయం. అందులో విష సర్పాలంటే దూరంగా ఉంటాం. అలాంటిది పార్క్ చేసిన స్కూటీ ముందు భాగంలో దూరిందో ఓ పాము. దీనిని గమనించిన యజమాని అక్కడున్న స్థానికులకు సమాచారం అందించాడు. తీవ్రంగా శ్రమించి పామును బయటకు తీశారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీరెల్లి చౌరస్తా సమీపంలో నోబుల్ స్కూల్ వద్ద పార్క్ చేసి ఉన్న స్కూటర్లో పాము దూరింది. ద్విచక్ర వాహనాన్ని యజమాని తీసుకుని ప్రయాణిస్తుండగా ఆ కట్ల పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. గమనించిన యజమాని వెంటనే స్కూటర్‌ను పక్కకు ఆపి అక్కడున్న స్థానికులకు తెలిపాడు.
వారు దాదాపు గంట సేపు శ్రమించి స్కూటర్ ముందు భాగాన్ని స్క్రూ డ్రైవర్ సాయంతో తీశారు. కానీ పాము ఎంతకీ వెళ్లకపోవడంతో కొంత సమయం వారు కష్ట పడాల్సి వచ్చింది. గంట పాటు శ్రమించి పామును బయటకు తీసి చంపారు. అది కట్లపాము కావడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కట్ల పాము కాటు వేస్తే ప్రాణాలు పోతాయని స్థానికులు చర్చించుకున్నారు.
ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కానీ పాము తన ద్విచక్ర వాహనంలోకి ఎలా దూరిందనే విషయంపై తీవ్రంగా ఆలోచించాడు. ద్విచక్ర వాహనాలు ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు పాములు లాంటివి దూరకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లుల ఉంటే తెలియకుండా వెళ్లి కూర్చుంటూ ఉంటారు. అలాంటప్పుడు వారు పాము కాటుకు బలై పోయే ప్రమాదం ఉంటుంది.
గతంలో ఓ స్కూటీలో దూరిన కొండచిలువ
అచ్చం ఇలాంటి ఘటనే గతంలో ఛత్తీస్‌గడ్‌లోనూ జరిగింది. ఇక్కడ కట్లపాము కానీ అక్కడ ఏకంగా కొండచిలువే స్కూటర్లో దూరింది. మనేంద్రగఢ్ భరత్‌పుర్ చిర్మిరి జిల్లాలో కొండచిలువ ఓ స్కూటీలోకి దూరి కలకలం సృష్టించింది. రెస్క్యూ బృందం చాలా సమయం శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటకు తీసింది. దానిని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.
స్కూల్ షూలో నాగుపాము- భయంతో బాలుడి పరుగులు- చివరకు?
Snake Inside Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము.. బైక్ తీస్తుండగా సౌండ్ వస్తోందని చూస్తే షాక్