ETV Bharat / state

అమ్మాయిలూ.. కాటుక పెట్టుకుంటున్నారా? - తస్మాత్​ జాగ్రత్త బోలెడు సైడ్​ ఎఫెక్ట్స్​ - Kajal side effects on Eyes - KAJAL SIDE EFFECTS ON EYES

Kajal Damage Caused by Eyes : వేడుకేదైనా సొగసైన కళ్లకు కాటుక అద్దనిదే కానీ అలంకరణ పూర్తి అయినట్లు మహిళలు, యువతులకు అనిపించదు. ఇది కళ్లకు అందం మాత్రమే పెంచడమే కాదు ఇతరులను కూడా ఆకర్షిస్తోంది. మరి ఈ కాటుకలు ఆరోగ్యానికి కీడును తలపెడుతున్నాయని నీతి ఆయోగ్​నే చెప్పింది. మరి అది నిజమేనా? అనారోగ్య సమస్యలు తెచ్చిపెడితే ఇంట్లోనే ఉంటూ నేచురల్​ కాటుకను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Kajal Damage Caused by Eyes
Kajal Damage Caused by Eyes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 7:23 AM IST

Side Effects of Kajal on Eyes in Telugu : కాటుక ఆడవారి సౌందర్య సాధనాల్లో ఒకటి. అమ్మాయిలూ, స్త్రీలూ వారి కళ్లకు కాటుక పెట్టుకోనిదే మేకప్​ పూర్తి కాదని భావిస్తారు. ఎంత ముస్తాబైన చివరగా కంటికి కాటుక లేకపోతే అందంగా లేమని చాలా మంది వనితలు అనుకుంటారు. అందుకే కంటికి పెట్టే కాటుక తెచ్చే అందమే వేరయా అంటారు. చక్కనైన డ్రెస్​, శారీ కట్టుకున్న కంటికి కాటుక పెడితేనే ఆ అందం. అందుకే ఆడవాళ్లు కాటుకకు అంతలా బిజినెస్​ ఉంది. అయితే నాటి కాలంలో వాడిన కాటుకతో కంటికి చాలానే లాభం ఉండేది. కానీ ప్రస్తుతం వాడుతున్న కాటుకల వల్ల కంటికి తీవ్ర నష్టమే జరుగుతోంది. అందుకే నిపుణులు అవసరం అయితే ఇప్పుడున్న కాటుకలను వాడవద్దని సలహాలు ఇస్తున్నారు.

అసలేందుకు మోడరన్​ డేస్​లో వచ్చిన కాటుకలను పెట్టుకోవద్దు : ఇప్పుడు వాడే కాటుకలన్నీ కమర్షియల్​ కాటుకలే. చాలా కాలం నిల్వ ఉండడానికి వాటిలోకి రసాయనాలను కలుపుతున్నారు.

  • లెడ్​, నిల్వ ఉండటానికి ఉపయోగించే పారాబెన్స్​, భార లోహాలు వంటివి కంటికి సైడ్​ ఎఫెక్ట్స్​ను తీసుకువస్తాయి.
  • లెడ్​ అయితే శరీరంలోకి ఇంకి మెదడు, ఎముకలపై తీవ్ర ప్రభావమే చూపుతుంది.
  • అలాగే రక్తహీనతకు దారి తీస్తుంది.
  • కింది కనురెప్పల్లో నూనె గ్రంథులు ఉంటాయి.
  • ఇవి నీటిని విడుదల చేసి, కళ్లకు తేమ అందేలా చేస్తాయి.
  • రసాయనాలతో కూడిన కాటుక రాయడం వల్ల అవి తెరుచుకోవు. దీంతో కళ్లుకు తగినంత తేమ అందక పొడిబారిపోతాయి.
  • రసాయనాలు ఉన్న కాటుకలను వాడటం వల్ల కంటికి అలర్జీలు, గ్లకోమా, కార్నియల్​ అల్సర్లు వంటివి వస్తాయి.
  • పిల్లల్లో ఈ కాటుకల రిస్క్​ మరీ ఎక్కువగా ఉంది.
  • నాడీ వ్యవస్థపై ప్రభావం పడి నేర్చుకోవడం ఆలస్యమవడం, ప్రవర్తనా సమస్యలు తీవ్రమైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

కాటుక పెట్టుకోకపోవడమే మంచిది : అందుకే రోజూ కాటుక పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టుకున్నా కొద్దిసేపయ్యాక తీసేయడమే ఉత్తమం. ఈ కాటుకను ఇతరులతో పంచుకోవద్దు. కాటుకను కొనేటప్పుడే తుది గడువులు గమనించుకోవాలి. లెడ్​ లేనివి చూసి ప్రత్యేకంగా ఎంచుకోవాలి. ఇంకా కాటుకకు బదులు ఐలైనర్​, మస్కారా, ఐషాడో వంటివి ప్రయత్నించడం మేలు. ఇవైతే కంట్లోకి పోవు. కానీ శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లోనే నేచురల్​ కాటుక తయారు :

  • రెండు చిన్న రాళ్లను తీసుకొని పొయ్యి మాదిరి తయారు చేసుకోవాలి.
  • ఈ రెండు రాళ్ల మధ్యలో ప్రమిదను ఉంచి, అందులో పత్తి లేదా గుడ్డతో చేసిన లావు పాటి ఒత్తును ఉంచాలి.
  • ఆ ప్రమిదలో ఆముదం పోయాలి.
  • అప్పుడు ఒత్తును వెలిగించాలి.
  • రాళ్లపైన ఒక స్టీలు లేదా ఇత్తడి లేదా రాగి ప్లేట్​ను ఉంచి దానికి కాస్త నూనె రాసి బోర్లించాలి. (మంట తగిలే వైపు)
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు అలానే ఉంచాలి. అవసరం అయితే మధ్యమధ్యలో ఆముదం పోయాలి.
  • తర్వాత బోర్లించిన పళ్లెం తీసి చూస్తే కాస్త నల్లటి పొడి లాంటిది దళసరిగా కమ్ముని అంటుకుని ఉంటుంది.
  • ఆ నల్లటి పొడిని తొలగించాలి. దానికి ముద్దలా ఏర్పడడానికి కొద్దిగా ఆముదం వేస్తూ ఉండాలి. ఆముదం మరీ ఎక్కువ అయితే పలుచగా వచ్చి కంటి కిందకు కాటుక జారిపోయి కాస్త వికారంగా ఉంటుంది.
  • అలా తీసిన నల్లటి పొడిని ముద్దగా చేసి ఒక కప్పులో భద్రపరుచుకుంటే నేచురల్​ కాటుక సిద్ధం.

కాటుక.. కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

మీరు వంటకు ఏ నూనె వాడుతున్నారు? - మీ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ నూనె మంచిదట! - Which Oil is Best for Cooking

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.