ETV Bharat / state

ఆకతాయి వేషాలు వేస్తే షీటీమ్స్ మీ తాటతీస్తుంది - She Team Arrested 200 Members - SHE TEAM ARRESTED 200 MEMBERS

గణేశ్ నిమజ్జనంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 200 మంది అరెస్టు - కోర్టులో హాజరుపరుచగా 3రోజుల జైలు శిక్ష

200 Jailed For Harassing Women During Ganesh Immersion
200 Jailed For Harassing Women During Ganesh Immersion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 7:18 PM IST

200 Jailed For Harassing Women During Ganesh Immersion : బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను టీజ్​ చేసిన అకతాయిల భరతం పడుతోంది షీ టీమ్స్. రద్దీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి వారితో ఊచలు లెక్కపెట్టిస్తోంది. ఇటీవల గణపతి నవరాత్రుల్లో మహిళలతో 996 మంది అసభ్యంగా ప్రవర్తించిన వారిని షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా అందులో 200మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. వారికి కోర్టు మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించింది. మిగతా వారికి పోలీస్ స్టేషన్​లోనే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

  • ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ మహిళా సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్‌ నిఘా కొనసాగుతుందని ఆమె తెలిపారు.

మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు - ఒక్క ఫిర్యాదుతో భరతం పడుతున్న షీటీమ్స్​ - She Team Action on eve Teasers HYD

పోలీసుల నుంచి కాల్ వచ్చే వరకు తెలియదు : చాలామంది యువకులు తమ ఇంట్లో బుద్ధిమంతులుగా ఉంటూ బయటకు రాగానే వేరే అవతారం ఎత్తుతారు. నిజం చెప్పాలంటే అపరిచితులుగా మారిపోతారు. ఇంట్లో రాములా బయటకు రాగానే రెమోగా అమ్మాయిల వెనుక తిరుగుతారు. కానీ వాళ్ల తల్లిదండ్రులకు మాత్రం వీళ్లు చేసే ఘనకార్యాలు ఏమీ తెలియవు.

కొన్ని సందర్భాల్లో 'మీ కుమారుడు ఇలా చేశాడు కేసు బుక్ అయ్యింది పోలీస్ స్టేషన్​కు రండి' అనే వరకు అసలు విషయం తెలియదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరైతే 'మా కుమారుడు అలా చేయడు మీరు ఎవరికి కాల్ చేశారో' అన్న సందర్భాలు ఉన్నాయి అంటున్నారు పోలీసులు. అందుకే తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలని సూచిస్తున్నారు.

పిల్లతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ : అమ్మాయిలపై వేధింపులకు దిగిన వారికి షీ టీమ్స్ తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇస్తుంది. అమ్మాయిలపై వేధింపులకు దిగితే ఎలాంటి కేసులు బుక్ చేస్తారు, అది తమ జీవితాన్ని ఎలా ప్రభావం చూపుతుందో వివరిస్తున్నారు. పిల్లలపై ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులే ఇంట్లో చెప్పాలని చెబుతున్నారు.

ఆడవాళ్లపై క్షణానికో వేధింపులు - నిందితుల్లో మేజర్ భాగం మైనర్లే - Minors in harassment cases

దారి తప్పుతున్న మైనర్లు.. షీటీమ్స్‌కు చిక్కుతోంది 40 శాతం వారే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.