ETV Bharat / state

కారు కారు ఎందుకు మా గల్లీలోకి కొట్టుకొచ్చావంటే? - వరద నీరు నన్ను మోసుకొచ్చిందని అందట - Krishna Nagar water Logging Problem - KRISHNA NAGAR WATER LOGGING PROBLEM

Rain Water Effect In Krishna Nagar : వానొచ్చిందంటే చాలు వరదొస్తది. వరద కేవలం అక్కడి గల్లీల్లోనే కాదు జనం వాట్సప్‌ స్టేటస్‌లోకీ వస్తుంది. ఎందుకంటే వచ్చే వరద ఊరికే రాదు వస్తు వస్తూ తనతో పాటు వాహనాలను, వస్తువులను మోసుకొస్తది. ఓ సారి ఏకంగా గుడి మండపమే ప్రవాహంతో పాటు వెళ్లిపోయింది. అందుకే అక్కడి జనం కూడా పెంపుడు జంతువుల్లాగా వాహనాలను ఇళ్ల ముందు కట్టేసుకుంటారు. వానొచ్చేటప్పుడు బయటికెళ్లిన వారు వాట్సప్‌ చూస్తే చాలు ఇంటికెళ్లాలో వద్దో నిర్ణయించుకుంటారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, సంపన్నులు నివాసం ఉండే కృష్ణానగర్‌ దుస్థితి. చినుకుపడితే చాలు విలవిల్లాడుతున్న కృష్ణానగర్‌ వాసులు వరద కష్టాలపై ప్రత్యేక కథనం.

Rain Water Effect In Krishna Nagar
Rain Water Effect In Krishna Nagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 12:08 PM IST

'కారూ కారూ ఎందుకు మీ గల్లీలో నుంచి మా గల్లీలోకి కొట్టుకొచ్చావంటే? వరద నీరు నన్ను మోసుకొచ్చిందని చెప్పిందట. వరదా వరదా మా గల్లీకి ఎందుకొచ్చావంటే నా కోసం పైపు లైన్ లేదని చెప్పిందట పైపు లైన్​ పైపు లైన్ ఎందుకు లేవని అడిగితే పైసలు లేక నన్ను నిర్మించలేదని అందట.' ఈ మాటలు వినడానికి చమత్కారంగా ఉన్నా వాన పడితే కృష్ణానగర్ జనాల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ల తరబడి వరద, మురుగు నీటి సమస్యతో నరకం అనుభవిస్తున్నారు.

Rain Water Effect In Krishna Nagar : కాలం ఏదైనా సరే వర్షం పడితే కృష్ణానగర్ ప్రాంతంలో వరద నీరు పోటెత్తుతుంది. దానికి మురుగు తోడవడంతో వీధుల్లో నడవాలంటే నరకయాతన తప్పదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో వరద నీటి సమస్య అక్కడి ప్రజలకు కన్నీటి కష్టంగా మారింది. ఇక్కడి ఏబీసీ బ్లాక్‌లు నిత్యం ముంపునకు గురవుతున్నాయి. చిన్న చినుకుపడ్డా, పెద్ద వాన కురిసినా వీధుల్లో నుంచి మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుంది.

రహదారులపై ప్రవహిస్తున్న మురుగునీరు : ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే సమస్య ఎదురవుతుండటంతో స్థానికులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని గమనించగా కృష్ణానగర్ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా అనిపించాయి. ఇళ్లు, దుకాణాల ముందు పేరుకుపోయి బురద, రహదారులపై దుర్గంధంతో పారుతున్న మురుగు నీరు వెరసి కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి కృష్ణానగర్ వీధుల్లో నెలకొంది. అంతేకాకుండా వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరకుండా అడ్డుగోడలు కట్టుకున్నారు.

డ్రైనేజీలు ఉండాల్సిన స్థలంలో ఇళ్లు : గత అనుభవాల దృష్ట్యా వరద ఉద్ధృతికి తమ విలువైన వాహనాలు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఇంటి గేట్లకు, షట్టర్లకు ద్విచక్రవాహనాలను తాళ్లతో కట్టేశారు. మురుగు నీరు ప్రవహించాల్సిన నాలాలు మూసుకుపోయాయి. అక్కడక్కడ నాలాలపై భవనాలు నిర్మించి అద్దెక్కిచ్చారు. మరోవైపు ప్రధాన వీధిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు.

కమ్యునిటీహాల్ వీధిలోని దుకాణ సముదాయాల్లోకి వరదనీరు చేరడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వరదనీటిని రోడ్డుపైకి తోడేశారు. బి-బ్లాకులోని సాయికిరణ్ పాఠశాల వద్ద ఉన్న మ్యాన్‌హోల్ పొంగుతుండటంతో 24 గంటలపాటు మురుగునీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. బి-బ్లాకులో వరద నీటి ఉద్ధృతికి రెండుచోట్ల మ్యాన్ హోళ్లు దెబ్బతినడంతో ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేశారు.

సమస్యకు మూలం అక్కడే : అయితే ఈ సమస్య ఎక్కడ మొదలైందని ఆరా తీయగా ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, గాయత్రీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు లోతట్టు ప్రాంతాలైన కృష్ణానగర్ ఏబీసీ బ్లాకులలో ప్రవహిస్తుంది. వరద నీరు సాఫీగా సాగడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, రహదారులన్నీ సీసీ రోడ్డుగా మారడంతో వరద నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదు.

వరదనీటిలో కొట్టుకుపోయిన కారు : ఇంకుడు గుంతలు లేకపోవడం, దానికితోడు వరద నీటి కాలువలు కొన్నిచోట్ల కబ్జాలకు గురికావడంతో ఆ నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో చిన్నగా ఉన్న సమస్య క్రమంగా పెను సమస్యగా మారింది. సత్వరమే పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కృష్ణానగర్ వరదనీటి సమస్య మరింత జఠిలంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు సి-బ్లాకులో పార్కింగ్‌లో ఉన్న ఓ కారు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. సింటెక్స్ నీటి ట్యాంకులు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.

Severe Disruption To Travel : గతంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేయగా వరద తాకిడికి ఏకంగా మండపంతోసహా కొట్టుకుపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉద్యోగులు, అత్యవసరం ఉన్న వారెవరైనా ఓలా, ఊబర్ బుక్ చేస్తే వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. అఖరికి తినడానికి ఏదైనా ఆర్డర్ చేస్తే స్విగ్గీ బాయ్ కూడా రాలేనని చెప్పడం గమనార్హం. దీంతో ఈ కాలనీల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ వరదనీరు ముంచెత్తడంతో కృష్ణానగర్ మీదుగా అమీర్ పేట, పంజాగుట్ట వైపు వెళ్లే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఇంద్రానగర్ నుంచి కృష్ణానగర్, యూసఫ్ గూడ, మైత్రివనం అలాగే ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్సార్ నగర్ వైపు గంటల కొద్ది రాకపోకలు నిలిచిపోతున్నాయి.

ఏళ్ల తరబడి పాలకులు తమ సమస్యలు చూస్తున్నారే తప్ప పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమస్యలపై ఎవరన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి కృష్ణానగర్‌లో దీర్ఘకాలికంగా ఉన్న వరద నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

కార్యరూపం దాల్చని పనులు : అయితే ఈ వరద నీటి సమస్యకు గతంలో పరిష్కరించేందుకు ప్రణాళికలు తయారుచేసినా కార్యరూపం దాల్చలేదు. వెంకటగిరి నుంచి అమీర్ పేట వరకు వరదనీటి కాలువ పనుల కోసం వైఎస్సార్ హయాంలో 14 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. సాంకేతిక కారణాలతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చొరవ తీసుకొని నిర్మాణం కోసం కోటి 90 లక్షల వ్యయంతో 2021లో పనులు ప్రారంభించారు.

కమ్యునిటీహాల్ ఎదురుగా పోలీసు మైదానం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ప్రాంగణం మీదుగా పోచమ్మతల్లి ఆలయం వరకు బాక్స్ టైప్ ఆర్​సీసీ డ్రెయిన్ పనులు చేపట్టారు. కానీ ఆ పనులు చేయడానికి సుమారు రెండున్నరేళ్లు పట్టింది. బాక్స్ టైప్ డ్రెయిన్ పనులు పోచమ్మతల్లి ఆలయం నుంచి ఏ-బ్లాకు వరకు కొనసాగడానికి మరిన్ని నిధులు అవసరమయ్యాయి. సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు సిఫారసు చేయడంతో మరో 60 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు మొదలుపెడతామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు.

ఇవీ అడ్డంకులు : కృష్ణానగర్ వరదనీటి సమస్య పరిష్కారం అటు జలమండలికి, ఇటు జీహెచ్​ఎంసీకి సవాల్‌గా మారింది. వరద నీటి కాలువ నిర్మించాలంటే ప్రధాన రహదారిని పూర్తిగా తవ్వాల్సి ఉంటుంది. పైగా ఈ మార్గంలో నివాస ప్రాంతాలు ఉండటం కాలువ నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ కారణంగా రోజుల తరబడి వరద నీటి సమస్యకు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కృష్ణానగర్ పై ప్రత్యేక దృష్టి ప్రజా పాలనకు అర్థం చేకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.

హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు

నిలిచిపోయిన డివైడర్ విస్తరణ పనులు - ప్రజలకు తప్పని ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.