Monkeys Died in Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో శాంతినగర్ భారీ సంఖ్యలో కోతులు మృతి చెందాయి. దాదాపు 50కి పైగా కోతులను గుర్తు తెలియని వ్యక్తులు కుప్పలుగా పోసి వెళ్లారు. అయితే వాటి బెడద తట్టుకోలేక చంపి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి తాము కోతుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ ఎప్పుడూ వాటికి హాని తలపెట్టాలని చూడలేదని స్థానికులు అంటున్నారు. కానీ ఎవరో ఇలాంటి దుర్మార్గ చర్యకు పాల్పడ్డారని మండిపడుతున్నారు.
భూముల ధరలకు రెక్కలు : మాములుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువే. దాదాపు అన్ని గ్రామాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకం అమలు చేయడంతో ప్రజల చూపు ఒక్కసారిగా భూముల వైపు మళ్లింది. అటవీ ప్రాంతంగా ఉన్న భూములలో సైతం ఉన్న చెట్లను తొలగించి చదును చేసి సాగులోకి తీసుకువచ్చారు. అలాగే వరి కొనుగోలు కూడా ప్రభుత్వమే చెేపట్టడం, మద్దతు ధర చెల్లించి కొనడంతో సాగు పరిధి పెరిగిపోయింది. ఇన్నాళ్లు బీడుభూములుగా ఉన్న చోట కూడా బాగు చేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు.
ఇలా అందరు అనుసరించడంతో మూగజీవాలకు గూడు, ఆహారం లాంటి మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. దీని కారణంగా కోతులు ఊర్లలోకి ప్రవేశించి ప్రజలను కాస్తా ఇబ్బంది పెట్టాయి. కోతులు రాకుండా కొంతమంది ఇంటి చుట్టు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో వానరాలను హనుమంతుడని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు.
కొంతమంది వాటి కోసం ప్రత్యేకంగా అరటి పండ్లను తీసుకువెళ్లి ఇస్తుంటారు. ఇలాంటి కిరాతకమైన పనులు మాత్రం ఎవరు చేయాలనుకోరు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగం ఇంకా స్పందించలేదు.
Monkey Viral Video : ఆఫీసర్ కుర్చీలో కూర్చుని ఫైళ్లు తిరగేసిన కోతి.. ఆరటిపండు ఇచ్చినా తలతిప్పకుండా..