ETV Bharat / state

జహీరాబాద్‌, బీదర్‌ రహదారిపై ఘోర ప్రమాదం - ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి - ZAHEERABAD BIDAR ROAD ACCIDENT

జహీరాబాద్‌-బీదర్‌ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్​ ప్రమాదంలో ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి

Karnataka RTC bus collides with Bike
Zaheerabad Bidar Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 6:55 PM IST

Updated : Oct 7, 2024, 7:05 PM IST

Four Died in Zaheerabad-Bidar Road Accident : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్​కల్ మండలం గణేశ్​పూర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లి రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు వేగంగా ఢీకొట్టడంతో గణేశ్​పూర్​కు చెందిన సిద్ధ రామప్ప(71) అతని కుమార్తె రేణుక(36), అల్లుడు జగన్నాథ్(41) సహా మనవడు వినయ్ కుమార్(15) మృతి చెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే సిద్ధ రామప్ప మృతిచెందగా తీవ్రంగా గాయపడిన జగన్నాథ్, రేణుక, వినయ్ కుమార్ కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఘటనపై హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 7, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.