Rushikonda beach in Vizag : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలనే అక్కడి ప్రభుత్వ ఆలోచనల మేరకు నగరం రెడీ అంటూ ముస్తాబవుతోంది. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఒక్కో అడ్వెంచర్‌ను ప్రత్యేక ఆకర్షణతో అందుబాటులోకి తెస్తున్నారు. కైలాసగిరిపై స్కై సైకిలింగ్(తీగలపై సైకిల్ నడపడం), జిప్‌లైనర్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సముద్రంలో జల విన్యాసాల కోసం అందమైన, ఆహ్లాదకరంగా ఉండే రుషికొండ బీచ్ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
చాలా కాలం తర్వాత మళ్లీ పునప్రారంభమైన స్కూబా డైవింగ్‌కు పలువురు ఆసక్తి చూపుతూ వాటిలో పాల్గొని సరదాగా గడుపుతున్నారు. పోయిన వారం కిందనే పారామోటార్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని సాయంతో ఆకాశంలో ఓ పక్షిలాగా విహరిస్తూ ఆ పచ్చటి కొండల మీదుగా వైజాగ్ నగర అందాలను వీక్షించొచ్చు. సముద్ర అలలపై స్పీడ్ బోట్‌తో రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు.
సూర్యుడు జన్మించినట్లు! : విశాఖపట్నానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో సులభంగా చేరుకోవచ్చు. కావాలంటే మంచి అనూభూతి కోసం చెన్నై నుంచి సముద్ర మార్గంలో ప్రయాణించే క్రూయిజ్లో(పెద్ద షిప్) రావచ్చు. వైజాగ్ చేరుకున్నాక మొదటగా ఆర్కే బీచ్ చేరుకొని అక్కడ తెల్లవారుజామున ఉదయించే సూర్యుడిని చూస్తే ఆ అనుభూతి కలిగించే మనశ్శాంతి చాలా ఆనందంగా ఉంటుంది. సముద్రం లోపల నుంచి సూర్యుడు జన్మిస్తున్నట్లు ఆ క్షణాల్లో అనిపిస్తుంది. సూర్య కిరణాలు శరీరానికే కాకుండా మనసుకు హత్తుకొని కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఆర్కే బీచ్కు సమీపంలోనే ఐఎన్‌ఎస్ కుర్‌సుర సబ్‌మెరైన్ మ్యూజియం ఉంటుంది. దానికి ఎదురుగానే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని కూడా సందర్శించొచ్చు. ఇవి రెండూ భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో విశిష్ట సేవలు అందించడం వీటి ప్రత్యేకత. ఈ మ్యూజియాలలో అనేక పరిజ్ఞాన విషయాలు తెలుసుకోవచ్చు. ఇవి అసలు మన రక్షణ దళాలకు ఎందుకు? వీటిని ఎలా వాడుతారు. యుద్ధ సమయాల్లో వాటిలో ఉండే జవాన్లు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు.
నాలుగు ప్రాంతాలు ఒక్క రోజే : ఇదే రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుంటే ఫిషింగ్ హార్బర్ కూడా ప్రత్యక్షమవుతుంది. వైజాగ్‌కు చేరుకున్న రోజే ఆర్టీసీ బస్టాండ్, జగదాంబ సెంటర్, ఆర్కే బీచ్‌కి దగ్గర్లో ఏదైనా హోటల్ తీసుకుంటే అన్ని ప్రదేశాలకు తిరగడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా ఒక్క రోజే ఈ నాలుగింటిని కవర్ చేయొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖపై సమీక్షలు నిర్వహిస్తూ విశాఖను పర్యాటకంలో అగ్రగామిగా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
వైజాగ్ to అండమాన్ - IRCTC స్పెషల్ ప్యాకేజీ - బీచ్‌లో ఫుల్ చిల్ అవ్వొచ్చు బాస్!