Sarvashreshth Tripathi Appointed as SIT Chief : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని, సిట్ చీఫ్‌గా నియమించింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి, గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పని చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజుని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు, తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిట‌్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.
తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం - SIT Chief Appointed On Laddu Issue
SIT Chief Appointed On Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు విధులు నిర్వహించనున్నారు.
Published : Sep 24, 2024, 6:31 PM IST