Sarpanches Problems in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సర్పంచ్లకు పంచాయితీ నిధులు, అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. ప్రభుత్వ తప్పిదాలకు గ్రామ పంచాయతీలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. దీనిపై ఆగ్రహం చెందిన సర్పంచ్లు నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. తాజాగా అనంతపురంలో కలెక్టరేట్ ఎదుట సర్పంచులు నిరసన దీక్ష చేపట్టారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసి గెలుపొందిన తాము కనీసం మురుగుకాల్వలూ శుభ్రం చేయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీలకు శాపంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు - నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచులు
గ్రామాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన రూ.10 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని కర్నూలులో నిరసన దీక్షలో సర్పంచులు కోరారు. నెల్లూరులో గాంధీ విగ్రహం ఎదుట సర్పంచులు ఆందోళన చేపట్టారు. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని వాపోయారు.
Sarpanches Anger Against YCP Government : రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సర్పంచులను బిచ్చమెత్తుకునేలా చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఏలూరులో సర్పంచుల ధర్నాకు చింతమనేని మద్దతు తెలిపారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిల్చుని సర్పంచులు నిరసన తెలిపారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తే తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు.
శ్రీకాకుళంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. జాతిపిత కలలు కన్న గ్రామస్వరాజ్యం రాష్ట్రంలో లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా పంచాయతీలకు రావాల్సిన నిధులు, విధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల సర్పంచుల ఆందోళన.."నిధుల మళ్లింపుపై సీబీఐ విచారణ జరిపించాలి"
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో సర్పంచులకు ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ప్రభుత్వం, పంచాయతీ పరిపాలన వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. సర్పంచుల అనుమతి, పంచాయతీ తీర్మానం లేకుండా ఆర్థిక సంఘం నిధులను డిస్కంలకు ప్రభుత్వం మళ్లిస్తోంది. పంచాయతీల పరిధిలో 11,162 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిపై మాత్రం సర్పంచులకు ఎలాంటి అధికారాలూ లేకుండా చేసింది. సచివాలయాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన గ్రామ సభకు సర్పంచి ఛైర్మన్ అయినా వారి పాత్రను నామమాత్రం చేస్తూ గ్రామ వాలంటీర్లను నియమించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాలు అందించే వరకు వాలంటీర్లే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
నిధుల కొరతతో సర్పంచుల అవస్థలు.. బ్లీచింగ్కూ డబ్బుల్లేని పరిస్థితి