ETV Bharat / state

'తప్పతాగి మా గది తలుపులు కొడుతున్నారు - మాకు రక్షణ కల్పించండి' - సంగారెడ్డి కాలేజీలో వేధింపులు

Sangareddy Degree women College Safety Issue : ఆకతాయిల ఆగడాలకు సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు నానా ఇబ్బంది పడుతున్నారు. కళాశాల ఆవరణలో కాపాలాదారులు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఆకతాయిల వికృతచేష్టలతో ప్రహరీ కూలిపోయింది. అగంతకులు రాత్రి సమయంలో మద్యం సేవిస్తూ కాలేజీ తలుపులు, కిటికీలు పగలగొడుతున్నారు. ఆ క్యాంపస్‌లో విద్యార్థినుల వసతిగృహం ఉంది. వారికి సరైన రక్షణలేకపోవడంతో తల్లిదండ్రులు కొత్తవారిని చేర్పించడానికి ఆసక్తి చూపడంలేదు.

Harassment Of Students By Hooligans
Sangareddy Degree women College Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 2:19 PM IST

తప్పతాగి మా గది తలుపులు కొడుతున్నారు - మాకు రక్షణ కల్పించండి

Sangareddy Degree women College Safety Issue : సంగారెడ్డిలోని డిగ్రీ మహిళా కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. తొమ్మిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ కాలేజీలో విద్యార్థినుల వసతి గృహం ఉంది. ఐతే స్థానికులు కృత్రిమంగా సమస్యలు సృష్టించడం నిత్యకృత్యమైంది. విద్యార్థినుల మూత్రశాల మెట్లను పూర్తిగా ధ్వంసం చేశారు. రాత్రివేళ మందుబాబులు లోనికి ప్రవేశించి విద్యార్థినుల హాస్టల్‌ పక్కనే ఉన్న తరగతి గదుల్లో నానా యాగి చేస్తున్నారు. అంతటితో ఆగని ఆకతాయిలు తాళం వేసిన తలుపులను రాడ్లతో ధ్వంసం చేస్తున్నారు. కాలేజీ వసతి గృహం వద్దకు అబ్బాయిలు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్లో యువతికి అసభ్యకరమైన సందేశాలు - దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు

"సెలవు రోజుల్లో ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తలుపులు, గోడను పగులగొట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. బొటానికల్ గార్డెన్​లో మొక్కలను నాశనం చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే మాపై తిరిగి వాగ్వాదానికి దిగుతున్నారు. వాష్​రూం మెట్లను ధ్వంసం చేశారు. భోజన సమయంలో యువకులు కామెంట్లు చేస్తున్నారు. ఒక వాచ్​మెన్​ను కేటాయించాలి." - విద్యార్థినులు

Harassment in Sangareddy Women's College : వసతిగృహం వద్ద బయట కుర్చోవాలంటేనే భయం వేస్తోందని చెబుతున్నారు. వాచ్‌మెన్‌ లేకపోవడంతో స్థానికులు రెచ్చిపోతున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మహిళా కాలేజీ కావడంతో అడిగే వాళ్లు లేరనే ఉద్దేశంతో స్థానికుల వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కళాశాల ప్రాంగాణానికి ప్రధానంగా రెండు గేట్లు ఉన్నాయి. ప్రధాన ద్వారం నుంచి కళాశాల వెనుక నుంచి ఉన్న గేటు ద్వారా వెళ్తే స్థానికులకు దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో గోడను కూల్చి వేసి మార్గంగా ఏర్పాటు చేసుకున్నారు. గేట్లకు తాళాలు వేస్తే వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలపై ప్రశ్నిస్తే స్థానికులు దుర్భాషలాడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.

వేధింపులు భరించలేమంటూ విద్యార్థినుల ధర్నా - ప్రిన్సిపల్​ సస్పెండ్

"కళాశాల ప్రాంగణంలో దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. 15 వేల విలువ గల వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు. పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. దీనిపై పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా వాచ్​మెన్​ను పెట్టుకోండి అని చెబుతున్నారు." - అశోక్‌ హెచ్‌వోడీ, కామర్స్‌

ఆకతాయిల నుంచి రక్షించండి : కళాశాల ఆవరణంలో ఆకతాయిలు, అగంతకుల చేష్టలతో విద్యార్థినీలకు రక్షణ లేకుండా పోయిందని పోలీసులకు అధ్యాపకులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇప్పటికైనా విద్యార్థినులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. విద్యార్థినులకు ఏదైనా ప్రమాదం జరగక ముందే ఉన్నతాధికారులు కళాశాల ప్రాంగాణాన్ని పరిశీలించి భద్రతను కల్పించాలని పలువురు కోరుతున్నారు.

"కళాశాలను స్థానికులు ఇష్టారీతినా వాడుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారు. కాపాలాదారుడు లేకపోవడంతో తమ పిల్లలను ఈ కాలేజీలో చేర్పించడానికి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. విద్యార్థినులపై యువకులు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పరిస్థితి మారలేదు." - అరుణాబాయి ప్రిన్సిపల్‌, మహిళా డిగ్రీ కళాశాల

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. న్యాయం చేయాలంటూ ఇఫ్లూలో ఆందోళనలు

మహిళా ఐపీఎస్​పై కారులో లైంగిక వేధింపులు.. మాజీ ఏడీజీపీకి మూడేళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.