Sammakka Saralamma Jatara 2024 : ప్రతీ రెండోళ్లకోసారి వచ్చే ఆదివాసుల జనజాతర ప్రారంభం కాబోతోంది. పెనుక వంశస్తులు సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారునిగా ముస్తాబు చేసి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పడగ రూపంలో అటవీ మార్గంలో మేడారానికి తీసుకొస్తున్నారు. దీనికి ముందు గ్రామ ప్రజలంతా తమ ఇళ్లను పుట్టమట్టితో అలికి ముగ్గులు వేసుకొని అందంగా తయారు చేస్తారు. స్వామి వారిని కుంకుమ భరిణ రూపంలో పెనుకవారి ఇంటి నుంచి ఆలయానికి తీసుకొచ్చారు.
అనంతరం స్వామివారిని పడగరూపంలో అలంకరించి ఆలయంలో పూజలు నిర్వహించారు. శివసత్తుల పూనకాలతో డోలు వాయిద్యాలతో స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. స్వామివారి ప్రతిమతో మేడారానికి అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. దాదాపు 70 కిలో మీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉండగా ఈరోజు కార్లపెల్లి, గుండ్లవాగు మీదుగా రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పెనుక వంశస్తుల ఇంట్లో బసచేసి రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరుతారు. బుధవారం రాత్రిలోపు మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు.
వనదేవతల జనజాతరకు వేళాయే - నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న పయనం
అక్కడ ముగ్గురు దేవతలకు పూజలు చేసి దేవుళ్లను రాత్రి చంద్ర గ్రహణం ముగిశాక గద్దెలపై ప్రతిష్ఠిస్తామని పూజారులు తెలిపారు. వనదేవత సమ్మక్కను ఫిబ్రవరి 22వ తేదీన అధికార లాంఛనాలతో తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. 23న, 24వ తేదిన సాయంత్రం వరకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని పూజారులు తెలిపారు. 24వ తేదీన సాయంత్రం వనదేవతలను తిరిగి వనప్రవేశం చేయిస్తామని చెప్పారు. దీంతో మేడారం జాతర ముగుస్తుందని తెలిపారు.
వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్బంప్స్ గ్యారంటీ
A Company Providing Facilities in Medaram Jatara : వనదేవతల దర్శనానికి తరలివెళ్లే భక్తులకు దాతలు అండగా నిలుస్తున్నారు. త్రాగునీరు ఆహారం అందిస్తూ సమ్మక్క సారలమ్మ వనదేవతల సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మీదుగా ఆర్టీసీ బస్టాండ్లో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఓ ఇన్ఫ్రా సంస్థ భోజనం, త్రాగునీరు సౌకర్యాన్ని కల్పింస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ప్రారంభించారు. మేడారం వెళ్లే భక్తులకు ఎవరికితోచిన విధంగా వారు కొంత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు.