Safety Tips for Women To Be Safe In Telugu : రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఆడవాళ్లపై హత్యాచారాలు, అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. నెలలు నిండని పసికందులు, యువతులు, ఇంటి దగ్గరే ఉంటున్న వృద్ధులను.. ఇలా వయసుతో సంబంధం లేకుండా విచక్షణ మరిచి మనిషి రూపంలో ఉన్న మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కానీ అలాంటి వారు చుట్టూ ఉన్నా అమ్మాయిలు గమనించలేకపోతున్నారు. మంచి మాటలు చెప్పి అదును చూసి జీవితాలను నాశనం చేసేస్తున్న వీరి బారి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా ఇలాంటి సంఘటనల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం, మహారాష్ట్రలోని నర్సరీ పిల్లలపై స్వీపర్ లైంగిక దాడి, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఓ ఆకతాయి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వంటివి ఎన్నో వార్తల్లో చూస్తున్నాం. ఇంకా ఎన్నో ఘటనలు పరువు పోతుందని భయపడి బయటకు రానివి ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి?
ఆడవాళ్లు ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు :
- ముఖ్యంగా యువత స్మార్టు ఫోన్లు వినియోగంలో జాగ్రత్తలు అవసరం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పెట్టడం, ఎవరో తెలియని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెఫ్ట్ చేయడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎవరు ఎలాంటి వారో తెలియకుండా చాటింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. సో వీటి పట్ల యువత అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
- ఎవరైనా వ్యక్తులు పరిచయం చేసుకుని స్నేహం పేరుతో దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని గుడ్డిగా నమ్మవద్దు. తన ప్రవర్తనలో మార్పు వస్తే మాత్రం కచ్చితంగా దూరం పెట్టండి. ఇంట్లో వారికి సమాచారం ఇవ్వాలి. ఈ విషయంలో అమ్మాయిలు కాస్త ధైర్యంగా ఉంటే మంచిది.
- కొన్నిసార్లు బంధువులు, ఇంట్లో వారి నడవడికనూ గమనిస్తూ ఉండటం బెటర్. ఎందుకంటే మీ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించడం ఉత్తమం.
- రోడ్డు మీద వెళ్లినప్పుడు, కాలేజీల్లో ఆకతాయిలు నిత్యం వేధింపులకు గురిచేస్తే ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పాలి. ఏదో అవుతుందని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులకు చెప్పాలి. అలా చేయకుంటే వేధింపులు అధికమై ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన అవసరం : చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారిపై లైంగిక దాడులు అధికంగా పెరుగుతున్నాయి. వారి శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం ముఖ్యం. వాటి విషయంలో సొంతంగా కొన్ని విషయాలు ఉంటాయని తెలియజేయాలి. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై పాఠశాల యాజమాన్యం పిల్లలకు అవగాహన కల్పించాలి.
మహిళల భద్రతకు టోల్ ఫ్రీ నంబర్ : బాధితులు ఈ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదిస్తే పరిష్కారం లభిస్తుంది. మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. 112/ 181
కొనఊపిరితో తమ్ముడికి రాఖీ కట్టి - కొద్ది గంటల్లోనే కనుమూసిన యువతి - RAKSHA BANDHAN ON DEATH BED
'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case