ETV Bharat / state

'అభయ' యాప్​ మీ ఫోన్​లో ఉంటే - ఆటోలోనూ మీరు సేఫ్​గా వెళ్లొచ్చు!

మహిళలు, ఇతర ప్రయాణికులకు భద్రత కల్పించనున్న పోలీసులు - క్యూఆర్‌ కోడ్​తో ఆటో డ్రైవర్​ వివరాలు

MY AUTO IS SAFE STICKERS
ఆటోకు స్టిక్కర్​ అతికిస్తున్న సీపీ అనురాధ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Abhaya APP in TG : మహిళా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు అభయ యాప్‌ దోహదం చేయనుంది. ఆటోల్లో రాకపోకలు సాగించే వారికి పటిష్ట భద్రత కల్పించనుంది. పోలీసు శాఖ ప్రత్యేక చొరవతో సిద్ధిపేట జిల్లాలోని ఆటో యజమానులు/ డ్రైవర్ల సంపూర్ణ సమాచారం సేకరించి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చి స్టిక్కర్​లు వేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో మొత్తం ఆటోలు 2550 ఉండగా, ఇప్పటి వరకు 1450 ఆటోలకు స్టిక్కరింగ్‌ పూర్తయింది.

స్కాన్‌తో సులువుగా : అభయ యాప్‌ (మై ఆటో ఈజ్‌ సేఫ్‌)పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్​ ఫోన్​తో స్కాన్‌ చేస్తే డ్రైవర్‌ ఫొటో, వివరాలతో పాటు వాహనానికి సంబంధించిన సమాచారం స్క్రీన్​పై కనిపిస్తుంది. ఈ యాప్‌లో ఫోన్​ నంబరు నమోదు చేసి ట్రేస్‌ ది లొకేషన్‌ను క్లిక్​ చేస్తే పోలీసులు సులువుగా పర్యవేక్షణ చేయనున్నారు. అవసరం మేర అత్యవసర కాల్, ఫిర్యాదు అనే ఆప్షన్స్​ కనిపిస్తాయి. దానికి స్పందించిన వెంటనే వాహన లైవ్‌ లొకేషన్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేరిపోతుంది. ఈ కేంద్రం నుంచి పోలీసులు నేరుగా పర్యవేక్షించే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరోవైపు సమీపంలో ఉండే పోలీసులు ఆ వాహనం వద్దకు చేరుకొని సమస్యను ఛేదిస్తారు.

నిజామాబాద్​ మేయర్‌ భర్తపై ఆటో డ్రైవర్​ దాడి - అదే కారణం!

ఎరుపు సంకేతం వచ్చిందంటే : మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆటో డ్రైవర్‌ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. వాహనంలో ఏదైనా విలువైన వస్తువులు మరిచిపోతే పోలీసులకు ఛేదించడం చాలా సులభంగా మారుతుంది. డ్రైవర్లు ఏదైనా కేసుల్లో నిందితులుగా ఉంటే స్కాన్‌ చేయగానే ప్రయాణం సురక్షితం కాదంటూ రెడ్​ కలర్​ సంకేతం వస్తుంది. ఫలితంగా భద్రతతో కూడిన ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. డ్రైవర్​ ప్రవర్తన ఆధారంగా వాహనానికి రేటింగ్‌ కూడా ఇవ్వొచ్చు.

డ్రైవర్లకు బీమా : ప్రవర్తన సరిగ్గా లేకున్నా, ర్యాష్‌ డ్రైవింగ్, రాంగ్‌ రూట్, నిర్దేశిత ప్రాంతం కాకుండా మరో చోటికి తీసుకెళ్లడం, మద్యం తాగి నడిపడం, ఇతరులను ఢీకొట్టి పారిపోవడం, ఇతర విభాగాల్లో ఈ యాప్‌ ద్వారా కంప్లైంట్​ చేయవచ్చు. డ్రైవర్లకు కూడా యాప్‌ మేలు చేస్తుంది. తొలుత ఈ స్టిక్కర్‌ పొందేందుకు రూ.350 ఖర్చవుతుంది. ఎవరైనా వాహనం దొంగిలిస్తే సదరు మార్గంలో సీసీ కెమెరాల సాయంతో ఆటోపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే లొకేషన్‌ తెలుసుకోవచ్చు. డ్రైవర్లకు ప్రమాద బీమా పాలసీని కూడా వర్తింపజేయనున్నారు. అందుకు ప్రతి ఏటా రూ.50 చెల్లించాలి. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే రూ.లక్ష బీమా వర్తించనుంది.

ఆటో డ్రైవర్లు యాప్‌ను స్టిక్కర్‌గా వేసుకోవాలి. యాప్‌పై విద్యాసంస్థల్లో, ప్రజలు, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తాం. ప్రయాణించే క్రమంలో మహిళలు, యువతులు, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి.

- అనూరాధ, సిద్ధిపేట పోలీసు కమిషనర్‌

అది ఆటో అనుకున్నావా? గూడ్స్ బండి అనుకున్నావా? - మరీ అంత మందిని ఎక్కించావేంటి బ్రో!

అర్ధరాత్రి యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం కేసు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.