ETV Bharat / state

ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియామకం - ఉత్తర్వులు జారీ - Dwaraka TirumalaRao ap new DGP - DWARAKA TIRUMALARAO AP NEW DGP

AP New DGP Dwaraka Tirumala : ఏపీ పోలీస్‌ బాస్‌గా ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. సీనియార్టీకి పట్టం కట్టిన ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా పోస్టింగ్‌ ఇచ్చింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్‌ సరిగా నియంత్రించలేదనే విమర్శలు ఎదుర్కొన్న హరీశ్​కుమార్‌ గుప్తాను తప్పించింది.

Dwaraka Tirumala Rao is The New DGP of AP
AP New DGP Dwaraka Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 9:12 AM IST

Updated : Jun 20, 2024, 9:33 AM IST

Dwaraka Tirumala Rao is The New DGP of AP : ఆంధ్రప్రదేశ్​ పోలీస్‌ బాస్‌గా ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. సీనియారిటీకి పట్టం కట్టిన ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా పోస్టింగ్‌ ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్‌ సరిగా నియంత్రించలేదనే విమర్శలు ఎదుర్కొన్న గత డీజీపీ హరీశ్​ కుమార్‌ గుప్తాను తప్పించింది.

రాష్ట్ర డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు. కర్నూలు ఎఎస్​పీగా మొట్ట మొదటి పోస్టింగ్‌ అందుకున్న ద్వారకా తిరుమలరావు, ఉమ్మడి రాష్ట్రంలో కామారెడ్డి, ధర్మవరంలోనూ ఎఎస్​పీగా పని చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పని చేశారు.

ఏపీలో 21 మంది ఐఏఎస్​లకు స్థాన చలనం - మార్పు మొదలైనట్లే! - IAS TRANSFERS in AP

అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ద్వారకా తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.

ఇక ప్రస్తుత డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా దాదాపు నెలన్నర పాటు పోలీస్‌ బాస్‌గా కొనసాగారు. వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులపై అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల సంఘం తప్పించి హరీష్‌ కుమార్‌ గుప్తాను నియమించింది. అలా మే 6న ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్‌ను సరిగ్గా నియంత్రించలేకపోయారు.

ఏకంగా గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రధానికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లలేకపోయారు. ఈ వ్యవహారంలో డీజీపీ తీరుపై గవర్నర్‌, కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితో పాటు సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ బాధ్యతల స్వీకరణ - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Took Charge Deputy CM

ఎన్నికల ప్రక్రియపై ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్​ - టీడీపీ స్ట్రాంగ్​ కౌంటర్​! - AP EX CM Jagan Tweet on EVMS

Last Updated : Jun 20, 2024, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.