Road Construction Works Delayed : నాగర్ కర్నూల్ మండల కేంద్రం, పట్టణ కేంద్రాల్లో డివైడర్ విస్తరణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా పనులు నిలిచిపోవడంతో ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వాహనాలు వెళుతున్నప్పుడు దుమ్ముూదూళి లేచి ఆ ప్రాంతంలో ఉండేవారు నరకయాతన పడుతున్నారు. పాదచారులు, ప్రమాదాల భారిన పడుతున్నారు. పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి.
Pending Road works In Nagarkurnool : చాలా చోట్ల సంబంధిత గుత్తేదారులు(contractors) బిల్లులు వచ్చిన తరువాతే మిగతా పనులు చేద్దామనే ఉద్దేశంతో విడిచిపెట్టారు. కొల్లాపూర్ పట్టణం, నాగర్ కర్నూల్ పట్టణం, బిజినపల్లి, తిమ్మాజిపేట మండల కేంద్రాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.కొల్లాపూర్ పట్టణంలో రూ .రెండు కోట్లతో డివైడర్ పనులు ప్రధాన కూడళ్ల వద్ద విస్తరణ పనులు చేపట్టారు. డివైడర్ పనులు పూర్తి చేశారు. కానీ విస్తరణ పనులు అసంపూర్తి గా ఉండిపోయాయి. స్వాగత తోరణం పనులు ఇంకా పూర్తి కాలేదు.
రోడ్డు విస్తరణ పనులు నిలిపివేత: ఉద్రిక్తం
People Facing Problems Due To Incomplete Roads : తిమ్మాజీపేట మండల కేంద్రంలో రూ.5కోట్లతో డివైడర్ రోడ్డు(Road) విస్తరణ పనులు చేపట్టారు. ఎన్నికల ముందు వేగంగా పనులు చేశారు. ఎన్నికలు ముగిశాక బిల్లుల సమస్యతో పనులు ఆగిపోయాయి. డివైడర్ విస్తరణ పనులు అసంపూర్తి గానే ఉన్నాయి. డివైడర్‌కు ఇరువైపులా కంకర పరిచి వదిలేశారు. వాహనాలు(vehicle) వెళ్తున్న సమయంలో విపరీతంగా దుమ్ములేచి ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళ్తున్న సమయంలో కంకరరాళ్లు ద్విచక్ర వాహనాలకు(Two-wheeler) తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయని, వ్యాపారాలు(Business) చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పనులు అసంపూర్తి - ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
బిజినేపల్లి మండల కేంద్రంలో రూ.6.5కోట్ల వ్యయంతో డివైడర్ విస్తరణ పనులు చేపట్టారు. ఇక్కడ కూడా పనులు అసంపూర్తిగానే(Incomplete) మిగిలాయి. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై కంకర వేసి కాంక్రీట్ వేయకపోడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని టీచర్స్ కాలనీ, ఎర్రగడ్డ కాలనీవాసులు కోరుతున్నారు. ఇదే రోడ్డులో మురుగు కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పైపులను తెచ్చిపెట్టారు కానీ ఇంకా పనులు పూర్తి కాలేదు. నిత్యం దుమ్ముదులితో వ్యాపారాలు సరిగా నడవక నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు - ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
Karimnagar Bridges: శిథిలావస్థకు కల్వర్టులు... ముందకు సాగని పనులు