ETV Bharat / state

ఉత్తరాంధ్రలో భూకుంభకోణాలను వెలికితీస్తాం- భూముల రీసర్వే అస్తవ్యస్తం : మంత్రి అనగాని - LAND SCAMS IN AP

Revenue Minister Anagani Satya Prasad on Land Scams: జగన్ ఏలుబడిలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో గాడితప్పిన రెవెన్యూ శాఖను సరిదిద్దుతామని, వంద రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేస్తామని తెలిపారు.

Revenue Minister Anagani Satya Prasad on Land Scams
Revenue Minister Anagani Satya Prasad on Land Scams (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 8:05 AM IST

Revenue Minister Anagani Satya Prasad on Land Scams : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభ కోణాలపై విచారణ జరిపి, బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎసైన్డ్‌ భూములను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ దందాలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని, ఈ కుట్రలో అధికారులు ఉన్నా, రాజకీయ నేతలు ఉన్నా వదలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రలో భూకుంభకోణాలను వెలికితీస్తాం- భూముల రీసర్వే అస్తవ్యస్తం : మంత్రి అనగాని (ETV Bharat)

Revenue Minister Anagani on Land Titling Act : వైఎస్సార్సీపీ పాలనలో గాడి తప్పిన రెవెన్యూ శాఖను వంద రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేస్తామని అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్రంలో రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్, భూముల రీ-సర్వే నిర్వహణ, పేదలకు ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు, లబ్ధిదారులను మోసగించి జరిగిన కొనుగోళ్లు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.

మంచి ముసుగులో దోపిడీ - ఎసైన్డ్‌ భూముల కోసం బరితెగించిన వైఎస్సార్సీపీ ముఠాలు - YSRCP Govt Eye on Assigned Lands

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భూములతో ప్రతి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, అటువంటి శాఖను తనకు కేటాయించినందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌కు సత్యప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2019-24 మధ్య రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రంలో జరిగిన చర్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయని గుర్తుచేశారు. భూ కుంభకోణాలు ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం కాలేదని, ఇతర చోట్ల కూడా జరిగాయని ఆరోపించారు. వీటిపై సమగ్రంగా అధ్యయనం చేయించి, తగిన ఆధారాలతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలను ఆందోళనకు గురిచేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లు శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు.

రాష్ట్రంలో భూముల రీ-సర్వే నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని, హడావుడి చర్యలతో ఇప్పటివరకు జరిగిన రీ-సర్వే చర్యలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటివరకు 6,300 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారని సత్యప్రసాద్‌ అన్నారు. భూముల విస్తీర్ణం తగ్గుదల, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని గుర్తు చేశారు. అవసరమైనచోట్ల రీ-సర్వేను మళ్లీ, మళ్లీ నిర్వహిస్తాం భరోసా ఇచ్చారు. ఒకరి పేరు మరొకరి పేర్లు భూ రికార్డుల్లో ఎక్కించారని, కులధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర సేవలను ప్రజలకు సులువుగా అందించేందుకు అవసరమైన చర్యలు చేబడతామని వివరించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం - రైతులు, న్యాయవాదులు సంబరాలు - chandrababu Repeal Land Titling Act

మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్‌ సిదార్థజైన్, అదనపు కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ అధికారిణి రచన వివరించారు. ఈ సందర్భంగా సీసీఏల్‌ఏ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అధికారులతో విడిగా సమావేశమైన మంత్రి రెవెన్యూ శాఖ కార్యకలాపాలు ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

22.24 ఎకరాల చెరువు భూమి కబ్జా - గ్రామస్థుల ఆందోళన - Illegal Registration of Pond Land

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.