ETV Bharat / state

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలే ఆలంబనగా - రేవంత్​ సర్కార్​ అడుగులు - Free Bus Travel in Telangana

Revanth Reddy Promises of Congress Schemes : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండింటిని అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈనెల 27న 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పంపిణీ వంటి రెండు కీలక హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. మరి వీటి అమలు ఎలా ఉండబోతోంది. విధి విధానాలు ఎలా ఉంటాయి. అమలైతే ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రెండు హామీలపై ప్రజా స్పందన ఎలా ఉంది.

Congress Six Guarantees Implementation
Revanth Reddy Promises of Congress Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 6:57 PM IST

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలే ఆలంబనగా - రేవంత్​ సర్కార్​ అడుగులు

Revanth Reddy Promises of Congress Schemes : కాంగ్రెస్‌ 2023 శాసనసభ ఎన్నికల్లో వదిలిన బ్రహ్మాస్త్రాలు ఆరు గ్యారంటీలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాయకుడు రాహుల్‌ గాంధీ చేతుల మీదుగా స్వయంగా ఈ గ్యారంటీలను ఆవిష్కరించిన కాంగ్రెస్‌ వీటి అమలుపై ప్రజలకు మరింత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ గ్యారంటీలపై ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా వీటినే ప్రధానాస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేసుకుంది.

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ

వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామని చెప్పి తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ 2హామీల అమలును ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ(Rajeev Arogyashri) పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపును అమలు చేశారు. తాజాగా మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలకు 2వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ హామీని ఈనెల 27న అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో ప్రకటించారు.

Congress Six Guarantees Implementation : కాంగ్రెస్‌ పార్టీ 6గ్యారంటీలుగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిర ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం వంటి పథకాలను ప్రకటించింది. దీనిలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌ డిసెంబర్‌ 7న ప్రమాణం చేయగా, డిసెంబర్‌ 9న వీటిని ప్రారంభించారు. మరి ఇప్పటి వరకు ఈ పథకాల అమలు తీరు ఎలా ఉందని పరిశీలిస్తే అంతటా సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది.

Free Bus Travel in Telangana : మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 18కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం అమలుకు ముందుతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి వరకు ఉద్యోగాలు, వ్యాపార లేదా ఇతర పనుల కోసం వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించిన మహిళలు ఆర్టీసీ బస్సుల బాట పట్టారు. అప్పటికే నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో పాటు వీరికి కూడా ప్రయాణ ఛార్జీలు ఆదా అవుతున్నాయి.

కాంగ్రెస్​లో ఎంపీ టికెట్ల పంచాయితీ - కుటుంబీకులకు ఇప్పించేందుకు ముఖ్యనేతల విశ్వ ప్రయత్నాలు!

నెల వారీ ప్రయాణ ఖర్చుల కోసం అయ్యే సుమారు 15వందల రూపాయల నుంచి 2వేల రూపాయల వరకు ఆదా చేసుకోగల్గుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి మహిళలు దీని ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారు. ఆదా చేసిన ఛార్జీల డబ్బులతో మహిళలు తమ కుటుంబ జీవితాన్ని మరింత మెరుగ్గా గడుపుతున్నారు.

Mahalaxmi Scheme in Telangana : మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆర్టీసీకి కూడా గణనీయంగా ప్రయోజనం కల్గిస్తోంది. దీని అమలు తర్వాత ఆక్యూపెన్సీ రేషియో మెరుగుపడింది. పలు జిల్లాల్లో అప్పటి వరకు 60శాతం ఓఆర్ 90శాతానికి పెరిగింది. పలు డిపోల్లో వంద శాతానికి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు(Express Buses) కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మహిళల ప్రయాణం కోసం జారీ చేస్తున్న జీరో టికెట్‌ డబ్బులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుండగా, పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో ఆ మేరకు ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతోంది.

ఇప్పటి వరకు తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను ఇది కొంతైనా గట్టెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్న రూట్లలో గతంలో బస్సు సర్వీసులను నిలిపివేసిన ఆర్టీసి పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో వాటిని నడపడం ఆరంభించింది. వాటి ద్వారా కూడా ఆర్టీసీకి ఆదాయం పెరగనుంది. ఇలా మహాలక్ష్మి పథకం అమలు ఇప్పటి వరకు సానుకూలంగానే సాగుతోంది.

Rajiv Aarogyasri Scheme Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండో పథకం రాజీవ్‌ ఆరోగ్య శ్రీ. ఆరోగ్య శ్రీ పథకం కింద గతంలో ఉన్న విధానాలకు మార్పులు చేసి అమలు చేస్తున్నారు. దీని కింద అప్పటి వరకు 5లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ఉండగా, దాన్ని 10లక్షల రూపాయలకు పెంచారు. దీని ద్వారా ఒక 1,672 వైద్య సేవలు కవర్‌ అవుతాయి. రాష్ట్రంలోని 1,310 ఆసుపత్రుల్లో ఇవి అమలవుతున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం 77లక్షల 19వేల మందికి ఆరోగ్య శ్రీ కార్డులుండగా, వారందరికీ పెంపు ప్రయోజనం అమలవుతోంది. రాష్ట్రంలో అంత కంటే ఎక్కువమంది పేదరికానికి దిగువన ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుండగా, రాబోయే రోజుల్లో వారికి కూడా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం అమలయ్యే అవకాశం ఉంది. వైద్య చికిత్సల విషయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ప్రయోజనం కల్గించనుంది.

ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి

ఆరు గ్యారంటీల కింద రెండు పథకాలు ఇప్పటి వరకు సాఫీగా అమలవుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాట మేరకు త్వరలో అమలు చేస్తామన్న హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. గృహజ్యోతి, 500రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలపై(Gas Cylinder Scheme) గురువారం సీఎం కేబినెట్‌ సబ్‌కమిటీతో చర్చించారు. గ్యాస్‌ సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై చర్చించారు. 2 పథకాలు ఫిబ్రవరి 27 న ప్రారంభం అయ్యేలా రేవంత్‌ ప్రకటించారు.

CM Revanth on Gas, Electricity Schemes : సిలిండర్ల పంపిణీ విషయంలో గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తుదారులకు కూడా సిలిండర్లు అందించాలని సూచించారు. గృహజ్యోతి పథకం కింద మార్చి మొదటివారం నుంచి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి విద్యుత్‌ బిల్లులు జారీ సమయంలో జీరో బిల్లులే ఇవ్వాలని స్పష్టం చేశారు. జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారు సవరించుకునే అవకాశం కల్పించాలని, విద్యుత్‌ బిల్లు కలెక్షన్‌ సెంటర్లు, సర్వీస్‌ సెంటర్లలో ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రతి రోజూ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 6గ్యారంటీలకు 53,196కోట్ల రూపాయలను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt). ఇంత వరకు బాగానే ఉంది. అయితే రాబోయే రోజుల్లో వీటికి నిధులే కాస్త సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2 నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.

నెలవారీ రాబడుల సొమ్మును నిర్దేశిత వ్యయాలకు మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు అత్యంత అవసరమైతే తప్ప నిధులను విడుదల చేయడం లేదు. అంతేకాక 2024-25 బడ్జెట్‌లో ప్రస్తుత బడ్జెట్‌తో పోలిస్తే 14% మేర తగ్గించి ప్రతిపాదించింది. మూలధన వ్యయాల విషయాల్లోనూ రేవంత్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి ఈ జాగ్రత్తలు పని చేస్తాయా, ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీల అమలుకు సర్కారు నిధులు ఎలా సమకూర్చుకుంటుంది, లబ్ధిదారులందరూ ప్రయోజనం పొందుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదు : సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీపై ఓ కన్నేసి ఉంచండి - వేస‌విలో తాగునీటి సమస్య రావొద్దు : సీఎం రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.