Revanth Reddy on Irrigation Deportment : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. ఆ రెండు నదులపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం విధి విధానాలు విభజన చట్టంలో ఉన్నాయని తెలిపారు. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. దీని ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరు?: సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy on BRS GOVT Mistakes : కృష్ణానదిలోని 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసిందని రేవంత్ తెలిపారు. ఏపీ 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారని వివరించారు. దీనికి కేసీఆర్(KCR) ప్రభుత్వం ఒప్పుకుని, సంతకాలు కూడా చేశారన్నారు. ప్రస్తుతం కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరివాహక ప్రాంతం ఎంతైతే రాష్ట్రంలో ఉంటుందో, ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా కృష్ణా నది నీటి కేటాయింపులు(KRMB) చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది జలాలపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఆక్షేపించారు. కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో కేసీఆర్, అధికారులు సంతకం పెట్టారని తెలిపారు.
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
"కేఆర్‌ఎంబీ మీటింగ్ మినిట్స్ తప్పుగా రాశారు. మీటింగ్ మినిట్స్ తప్పుగా రాయడంపై జనవరి 27న మన అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం మేం కొట్లాడుతున్నాం. కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెప్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌ను జగన్ ఆక్రమిస్తే, కేసీఆర్ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. ప్రాజెక్టులపై శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తాం. సాగు నీటి ప్రాజెక్టులపై రెండు రోజులు ప్రత్యేకంగా చర్చిస్తాం. ప్రాజెక్టులపై కేసీఆర్ ఎంతసేపైనా మాట్లాడొచ్చు. మేం అడ్డురాం."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
Revanth Reddy on Rayalaseema Project : గతంలో చంద్రబాబు(Chandra Babu) హయాంలో ముచ్చుమర్రి కట్టి 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు యత్నించారని రేవంత్ తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరించారు. ఆయన హయాంలోనే ఆ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు మొదలయ్యాయని పేర్కొన్నారు. వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు. పదవులు, కమీషన్లకు కేసీఆర్ లొంగి జల దోపిడీకి సహకరించారని మండిపడ్డారు.
త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
"ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో కేసీఆర్ కిలోమీటరు మాత్రమే టన్నెల్ నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలో జరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతలపై కూడా కేసీఆర్ నిర్లక్ష్యం వహించారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్‌రావు సహకరించి, పదవుల కోసం పెదవులు మూసుకున్నారు." -రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
Revanth Reddy Comments on CM Jagan : రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) ప్రణాళిక వేశారని రేవంత్ అన్నారు. మే 5, 2020న ఈ ప్రాజెక్ట్‌కు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. శ్రీశైలం నీళ్లే కాదు బురద కూడా ఎత్తిపోసుకునేలా రోజుకు 8 టీఎంసీలు తరలించేలా జగన్ యత్నించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి కేసీఆర్ అనుమతిచ్చారు. సాక్షాత్తూ ప్రగతిభవన్‌లోనే జగన్, కేసీఆర్‌ను కలసి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. జగన్‌తో చీకటి ఒప్పందం మేరకే కేసీఆర్ అప్పట్లో కేఆర్‌ఎంబీ భేటీకి వెళ్లలేదని, రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రత్యేక నిధులు: సీఎం రేవంత్