ETV Bharat / state

ఏప్రిల్​ 6న తుక్కుగూడ సభ - 5 గ్యారంటీలు ప్రకటించనున్న రాహుల్​ గాంధీ : సీఎం రేవంత్​ రెడ్డి - Revanth Reddy Kodangal meeting - REVANTH REDDY KODANGAL MEETING

Revanth Reddy Kodangal Meet : వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ ఉంటుందని, ఆ సభలో రాహుల్‌ గాంధీ 5 గ్యారెంటీలను ప్రకటిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్‌, లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌కు త్వరలో పరిశ్రమలు తీసుకొస్తానని తెలిపిన సీఎం, ఇక్కడికి సిమెంట్‌ ఫ్యాక్టరీ రానుందని ప్రకటించారు.

Revanth Reddy Kodangal Meeting
MAHABUBNAGAR MLC BY ELECTIONS 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 5:55 PM IST

Updated : Mar 28, 2024, 10:04 PM IST

ఎక్కడ ఉన్నా నా కన్ను కొడంగల్‌పైనే ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy Kodangal Meet : కొడంగల్ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు, పనులు తీసుకువచ్చే బాధ్యత తనదని, కాని ఆ అభివృద్ధి పనుల్ని సకాలంలో పూర్తి అయ్యేలా సహకరించాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) అన్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొండగల్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు.

ప్రశాంతంగా ముగిసిన మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - 100 శాతం పోలింగ్ నమోదు - Mahabubnagar MLC by election 2024

దీంతో రేవంత్‌ను చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించవచ్చారు. దీంతో వారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపు మాట్లాడారు. ప్రతికష్టంలో కొడంగల్(Kodangal) ప్రజలు అండగా ఉన్నారని, ఇంత చేసిన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. అపారమైన నాపరాయి గనులు ఉన్నా, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని, పరిశ్రమలు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయన్నారు.

ఫార్మా కంపెనీలొస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. అక్కడి ప్రజలు భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. భూసేకరణలో పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అభివృద్ధికి సహకరించకపోతే కొడంగల్ ప్రాంతం ప్రాంతం నష్టపోతుందని గుర్తు చేశారు. కొడంగల్‌కు ఏళ్లుగా మంత్రులు లేరని ఏకంగా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

తానెక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పై ఉంటుందని, కొడంగల్ ప్రజల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50వేల మెజారిటీ రావాలని కోరారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 8న కొండగల్ వస్తానని, మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానని చెప్పారు. ఏప్రిల్ 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

"మీకు మేలు జరగాలని, ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే నా ఆకాంక్ష. నేను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినే. లోక్​సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించాలి. ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరండి". - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

'ఏప్రిల్​లో తుక్కుగూడలో కాంగ్రెస్‌ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National level meeting

నేను చేరలేని దూరం కాదు - దొరకనంత దుర్గం కాదు - సామాన్య మనిషిని నేను : సీఎం రేవంత్​ - CM Revanth on Common People

Last Updated : Mar 28, 2024, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.