ETV Bharat / state

నీట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ - స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట - NEET Counselling Case Update in TG

Supreme Court Verdict on NEET Counselling : నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.

NEET Counselling Case Update
Supreme Court Verdict on NEET Counselling (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 1:46 PM IST

Updated : Sep 20, 2024, 3:02 PM IST

Supreme Court Verdict On NEET Counselling Issue : నీట్​ కౌన్సెలింగ్​లో స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. కౌన్సెలింగ్​కు విద్యార్థులు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల కౌన్సెలింగ్​కు ప్రభుత్వం అంగీకరించింది. సమయం తక్కువగా ఉండటంతో అనుమతించినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఒక్కసారే అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్​పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్థానికతను నిర్ధారిస్తూ 4 తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తీర్పులు స్పష్టంగా ఉన్నా, మళ్లీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విద్యార్థుల తరఫు న్యాయవాది విభేదించారు. రెండు, మూడేళ్లు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను ఎలా తీసేస్తారని విద్యార్థులు అన్నారు.

మెరిట్స్​లోకి వెళ్లేంత సమయం లేదు : దీనిపై స్పందించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం మెరిట్స్​లోకి వెళ్లేంత సమయం ఇప్పుడు లేదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​ అడిగారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టుకు ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గిరిజన యువకుడి అరుదైన ఘనత- అక్కడ నీట్​ క్వాలిఫై అయిన తొలి వ్యక్తిగా రికార్డ్​! - First Bonda Tribe To Crack NEET

పరీక్ష కేంద్రాల వారీగా NEET ఫలితాలు ప్రకటించండి: సుప్రీం కోర్టు - NEET UG Paper Leak Case

Last Updated : Sep 20, 2024, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.