ETV Bharat / state

రియల్టర్‌ కమ్మరి కృష్ణను చంపించింది కుమారుడే - రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య - Shadnagar Realtor KK Murder Case

Realtor Kammari Krishna Murder Case Update : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కమ్మరి కృష్ణ హత్యకేసు చిక్కుముడి వీడింది. రియల్టర్‌ కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఆస్తి విషయమై ఈ దారుణానికి ఒడిగట్టాడని, రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Police Solved Shadnagar Realtor Murder Case
Realtor Kammari Krishna Murder Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 3:36 PM IST

Updated : Jul 13, 2024, 4:40 PM IST

Police Solved Shadnagar Realtor Murder Case : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్న కుమారుడే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా కమ్మదనంలో ఈ నెల 10వ తేదీన జరిగిన కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్​నగర్ పోలీసులు ఛేదించారు. షాద్​నగర్ పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ హత్య​ వివరాలు వెల్లడించారు.

రియల్టర్‌ కమ్మరి కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడో భార్య అయిన కమ్మరి పావని పేరుతో కృష్ణ ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం మూడో భార్యకే రాసేస్తాడనే కోపంతోనే మొదటి భార్య కుమారుడైన కమ్మరి శివ తన తండ్రిని హత్య చేయించినట్లు వివరించారు. దీనికోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ ముగ్గురితో హత్య చేయించినట్లు పేర్కొన్నారు.

"శంషాబాద్‌ ఠాణా పరిధి హైదర్​షాకోటలో నివసిస్తున్న రియల్‌ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ ఇటీవల హత్యకు గురయ్యాడు. కాగా ఆయనకు ముగ్గురు భార్యలు. కృష్ణ మూడో భార్య పావని పేరిట కొంత ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడంతో తన మొదటి భార్య కుమారుడు శివ అడ్డు చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో విబేధాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే తన తండ్రి కమ్మరి కృష్ణను హత్య చేయాలనుకున్నాడు శివ. అందుకు పథకం పన్నాడు. తన తండ్రి వద్ద బాడీగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న బాబా శివానంద్‌కు, తండ్రిని హత్య చేసేందుకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు."- రాజేశ్, శంషాబాద్ జోన్ డీసీపీ

రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య : నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే తన తండ్రి అంగరక్షకుడు శివానంద్ అలియాస్ బాబాకు విషయం చెప్పి హత్యకై ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. రూ.25 లక్షలు సుపారి ఒప్పందం కుదుర్చుకున్న శివానంద్​ తన సన్నితులైన గణేశ్​, జేసీఎల్( మైనర్) ముగ్గురు కలిసి హత్య చేయాలని అవకాశం కోసం ఎదురు చూశారన్నారు.

ఈ నెల 10 వ తేదీన కమ్మదనం శివారులోని కేకే ఫామ్ హౌస్​లో కృష్ణను హత్య చేయడానికి నిశ్చయించుకుని, ఫామ్ హౌస్​లో కేకేను గణేశ్​, మైనర్ బాలుడు చేతులు పట్టుకోగా బాబా కత్తితో కృష్ణ గొంతు కోసి ఆ తర్వాత కడుపులో పొడిచినట్లు వివరించారు. అనంతరం వారు పారిపోయారని, కేకే మూడో భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసిన బృందాన్ని డీసీపీ అభినందించారు. ఉన్నతాధికారుల చేత బృందానికి రివార్డు ఇప్పించినట్టు వివరించారు.

ఉప్పల్​లో దారుణం - భార్యను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పరారైన భర్త - husband murder his wife In Uppal

నా పెళ్లాన్ని నాకు దూరం చేస్తారా? - కోపంతో యువతి తల్లిదండ్రులను చంపిన యువకుడు - YOUNG MAN KILLS LOVER PARENTS

Last Updated : Jul 13, 2024, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.