ETV Bharat / state

హైదరాబాద్‌లో రియల్ భూమ్ - ధరలు పెరగకముందే ఈ ప్రాంతాల్లో కొనుగోలు బెస్ట్ - Real Estate in Hyderbad

Real Estate in Hyderbad : హైదరాబాద్‌లో సొంతిల్లు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్త్‌లో రియల్‌భూమ్‌ మరింత పెరిగిపోనుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు మరింతగా పెరగకముందే స్థలాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రస్తుతం నగరంలో ఎక్కడ తక్కువ ధరలు ఉన్నాయి. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఈ కింది స్టోరీలో తెలుసుకుందాం.

Best Areas to Buy Place in Hyderabad
Real Estate in Hyderbad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 9:12 AM IST

Best Areas to Buy Place in Hyderabad : భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌, ఫోర్త్‌సిటీ ప్రతిపాదనలతో నగరంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంతో తక్కువ ధరతో స్థలాన్ని కొనుగోలు చేయడానికి అన్వేషించడం ప్రారంభించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నడిబొడ్డున ఇల్లు, స్థలాలు కొనలేకపోయినవారు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు చేయనివారు ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల వరకు వెళ్లారు. స్థలాలు, విల్లాలు కొనుగోలు చేశారు.

ప్రాంతీయం రహదారి అవకాశాలమయం : నగరంలో ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ మధ్యనే రియల్‌ ఎస్టేట్‌ విస్తరణకు అవకాశం ఉంటుందని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) 347 కి.మీ. పొడవున రాబోతుంది. ఇది 20 పట్టణాలు, 175 గ్రామాల మీదుగా వెళుతోంది. 17 వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు అనుసంధానం కాబోతుంది. ఇవి కాకుండా పలుచోట్ల ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ కలుపుతూ రేడియల్‌ రహదారులను నిర్మించనున్నారు. రియల్టీ పరంగా ఇదో మంచి పరిణామం అంటున్నారు డెవలపర్లు.

ఒక్కొక్కటిగా మౌలిక వసతులు : రాష్ట్రంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలోనే పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. కళాశాలలే కాదు ప్రముఖ అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు సైతం ఇక్కడ విశాలమైన ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం సిటీ నుంచి రోజూ విద్యార్థులు వెళ్లి వస్తున్నారు. లేదంటే హాస్టళ్లలో ఉంటున్నారు. త్వరలో ఆయా విద్యా ప్రాంగణాల చుట్టుపక్కల భారీగా నివాసాలు వచ్చే అవకాశం ఉందని రియల్ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శంషాబాద్‌ విమానాశ్రయం, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లు సైతం ఓఆర్‌ఆర్‌ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగేకొద్దీ రవాణా వ్యవస్థ మెరుగుయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మెట్రో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి టూరిస్టు కేంద్రం, సమతామూర్తి కేంద్రం, కన్హా శాంతివనం, ప్రముఖ దేవాలయాలు, రిసార్ట్‌లన్నీ అవుటర్, ఆర్ఆర్ఆర్ రహదారి మధ్యనే కేంద్రీకృతం అయ్యాయి. ఈ కేంద్రాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు భారీగానే వస్తున్నారు.

రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్‌ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీని, టౌన్‌షిప్పులు, క్రికెట్ స్టేడియం వంటివి నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫ్యూచర్‌ సిటీ నుంచి రావిర్యాల మీదుగా మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రశాంతమైన నివాసం : పదవీ విరమణ తర్వాత చాలామంది సిటీలోని రణగొణధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన స్థలం కావాలని కోరుకుంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేంత దూరానికి సుముఖత చూపుతున్నారు. ఇదివరకే కొన్న ఫాంహౌస్‌లను నివాసంగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. లేనివారు విశాలమైన స్థలాల కోసం వెతుకుతున్నారు. నిర్మాణ సంస్థలు సైతం ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నాయి.

ట్రిపుల్‌ ఆర్‌, ఓఆర్‌ఆర్ మధ్యనే 10 వరకు పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఇందుకోసం కసరత్తు చేస్తోంది. ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. భవిష్యత్తు రియాల్టీ విస్తరణ ఇటే ఉంటుందని రియాల్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తవి, పాతవి ఉన్నాయి : ఆర్ఆర్ఆర్ లోపల ఇదివరకే పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను వేశారు. ప్రభుత్వ అనుమతి ఉన్నవి, లేనివి, ఫాంహౌస్‌ వెంచర్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో ధరలు ప్రాంతాల ఆధారంగా వేర్వేరుగా ఉన్నాయి. ట్రిపుల్‌ ఆర్‌ ప్రతిపాదనతో ఇటీవల కాలంలో భూముల ధరలు పెరగడంతో కొత్త వెంచర్లపై వాటి ప్రభావం పడింది. వీటిపైన డిస్కౌంట్‌లు ఇస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ చుట్టుపక్కల రైతుల నుంచి భూములు కొనేందుకు రియల్టర్లు దృష్టిసారించారు

భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతం ప్రధాన కేంద్రం కాబోతుంది. సంగారెడ్డి వైపు పటాన్‌చెరు దాదాపు సిటీలో కలిసిపోయే దశకు వచ్చింది. సాగర్, శ్రీశైలం రహదారుల మధ్యలో అభివృద్ధి కాబోతున్న నాలుగో నగరం రియాల్టీకి ప్రధాన ఆకర్షణ కాబోతుంది.

లెక్క మారింది - 'తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు' - Land Prices Increased In Telangana

అక్కడ గజం రూ.లక్ష - అయినా అందరి చూపూ అటు వైపే - Real Estate Business in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.