ETV Bharat / state

తెలంగాణలో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు - గతేడాది కంటే 15 శాతం అధికంగా రిజిస్ట్రేషన్లు - House Sales Increased in Hyderabad - HOUSE SALES INCREASED IN HYDERABAD

House Sales Increased in Telangana 2024 : రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు జరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే దాదాపు 15 శాతం అధికంగా ఈ సంవత్సరం జరిగాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లను తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 46 శాతం పెరుగుదల నమోదైంది.

House Sales Increased in Hyderabad
House Sales Increased in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 9:19 AM IST

రాష్ట్రంలో వృద్ధిపథంలో స్థిరాస్తిరంగం (ETV Bharat)

Property Registrations Increased in Hyderabad 2024 : దేశంలోని ఇతర మెట్రోపాలిటన్‌ నగరాలతో పోలిస్తే అటు నివాసానికి, ఇటు వ్యాపారానికి అనుకూలమైనది హైదరాబాద్‌. రాష్ట్రం విడిపోతే ఇక్కడ స్థిరాస్తి రంగం కుంటుపడుతుందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఇక్కడి అభివృద్ధి స్పష్టం చేస్తోంది. అటు వరుస ఎన్నికలు వచ్చినా, తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు యధాతథంగా కొనసాగాయి. ఎన్నికల నియమావళి కారణంగా అనుమతులకు కొంత ఇబ్బంది ఏర్పడి కొత్త ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రాకపోయినా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా సాగాయి.

Telangana Property Trends 2024 : జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఎన్నికల సమయంలోనూ క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయని స్పష్టమవుతోంది. 2023లో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 22,632 గృహాలు రిజిస్ట్రేషన్‌ జరగగా ఈ సంవత్సరం ఇదే సమయంలో 26,027 ఇళ్లు రిజిస్ట్రేషన్‌ అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది కంటే 15 శాతం అధికం.

అదేవిధంగా గతేడాది హైదరాబాద్‌లో స్థిరాస్తిరంగంలో 15 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ ఏడాది 16 శాతం వృద్ధి నమోదైంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో గత 46 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గి 39 శాతానికే పరిమితమైంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 39 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈసారి ఏకంగా 46 శాతం వృద్ది కనబరిచినట్లు క్రెడాయ్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

70 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్లు : హైదరాబాద్‌ మార్కెట్‌లో మూడువేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాల కొనుగోలు చేసే వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. రెండు నుంచి మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా గతేడాది కంటే పది శాతానికి పైగా పెరుగుదల నమోదు చేసింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 70 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1000 చదరపు అడుగులులోపు విస్తీర్ణం కలిగిన నివాసాలు కొనుగోలు చేసే పేదలు శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ధరలను పరిశీలించినట్లయితే బెంగళూరులో గతేడాది మొదటి త్రైమాసికంలో తొమ్మిది వేలుగా ఉన్నసగటు చదరపు అడుగు ధర ఈ సంవత్సరం పదిన్నర వేలకు ఎగబాకి 19 శాతం పెరిగింది. రాజధాని దిల్లీలో చదరపు అడుగు ధర 16 శాతం పెరుగుదల నమోదు చేయగా, అహ్మదాబాద్‌లో, పుణెలో 13 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, ముంబయిలో 6 శాతం, కలకత్తాలో 7 శాతం, చెన్నైలో 4 శాతం లెక్కన పెరుగుదల ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల పెరుగుదల బెంగళూరులో అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత స్థానంలో దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు వరుసగా ఉన్నాయి.

స్థిరాస్తి రంగంపై ముఖ్యమంత్రి ఫోకస్ : కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం, ఇతర మంత్రులు ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగానే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడ్‌తో వల్ల పరిపాలనలో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఐతే పక్షం రోజుల్లో ఎన్నికల నియమావళి ముగియనుండడంతో స్థిరాస్తి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత దృష్టిసారించే అవకాశం ఉంది. మరింత వృద్ధి సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు అమల్లోకి పెడుతారని బిల్డర్లు భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్​పై 2024 ఎన్నికల​ ఎఫెక్ట్​- అప్పటితో పోలిస్తే హౌస్​ సేల్స్​ డబుల్​! - Election Effect On Real Estate

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.