Ravi Success Story of Got Three Jobs : ఒక ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ఈ రోజుల్లో మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు ఈ యువకుడు. సాధారణ వ్యవసాయం కుటుంబంలో పుట్టి కలలు సాకారం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టుదల, నిరంతర సాధనలతో వాటన్నింటిని అధిగమించి విజయం సాధించాడు ఈ ఔత్సాహికుడు. ఈ యువకుడి పేరు గడ్డం రవి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.
చదువుల్లో రాణించి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తాము పడుతున్న కష్టం నువ్వు పడకూడదు. బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కుటుంబసభ్యులు సూచించారు. వారి కలను సాకారం చేయాలని హైదరాబాద్ వెళ్లి గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాడు ఈ యువకుడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న సమయంలో నోటిఫికేషన్స్ లేకపోవడంతో ఉస్మానియాలో ఎమ్ఏ లైబ్రేరియన్ సైన్స్ చేశాడు. అక్కడే గ్రూప్స్‌కి సిద్ధమవుతూ నెట్, జేఆర్‌ఎఫ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు.
Yuva Story of Ravi Got Three Jobs : ఇటీవల ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యాలయాల పరీక్షలో(Gurukula Jobs) లైబ్రేరియన్ సైన్స్ విభాగం నుంచి మొదటి ర్యాంకు సాధించాడు. ఫలితంగా జూనియన్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులు సాధించాడు. మరోవైపు పీజీటీ విభాగం నుంచి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే సహనం, ఓపిక అవసరం చాలా అవసరం. మూడు, నాలుగు సార్లు విఫలమైన ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు.
4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్ కుర్రాడు
Gurukula Jobs Topper Ravi Interview : తనకు వచ్చిన 3 ఉద్యోగాల్లో డిగ్రీ లైబ్రేరియన్ లెక్చరర్‌గా చేరడానికి రవి సిద్ధమాయ్యాడు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించినట్లు చెబుతున్నాడు రవి.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు చెబుతున్నాడు రవి. లైబ్రేరియన్ కోర్సులకు సంబంధించి సరైన మెటీరియల్ లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. సొంతంగా తానే మెటీరియల్ తయారుచేసుకుని చదవడం వలన ఉద్యోగం సాధించినని రవి అంటున్నారు. మా నమ్మకాన్ని నిజం చేస్తూ రవి సాధించిన ఈ విజయాలు మమ్మల్ని గర్వించేలా చేస్తున్నాయి.
ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విమర్శకులు చేసిన వారే ఇవాళ శభాష్ అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏడేళ్లు శ్రమించాడు రవి. కొన్నిపోటీ పరీక్షలలో ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నాడు. ఆ సమయంలో చాలా మంది నీ వల్ల కాదని విమర్శించారు. అయినా లక్ష్యంపైనే దృష్టి సారించి విజయకేతనం ఎగరేశాడు. అయితే మనం ఎందులో వెనుక ఉన్నామో గమనించి.. స్మార్ట్ వర్క్ చేస్తే విజయం సాధించవచ్చని చెబుతున్నాడు రవి.
"నేను ఏడేళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభించింది. నన్ను మా అమ్మనాన్న, అన్నయ్య ప్రోత్సహించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఓపిక చాలా అవసరం. దేనికి నిరుత్సాహపడకుండా శ్రమిస్తే విజయం సాధించవచ్చు". - రవి, యువ ఉద్యోగి
యువ ఔత్సాహికుల వినూత్న ఆవిష్కరణలు- అకట్టుకున్న వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎగ్జిబిషన్