Ratan Tata Financial Tips : రతన్ టాటా అనగానే మనం ఠక్కున ఒకే ఒక్కటి గుర్తు చేసుకుంటాం. టాటా వస్తువు క్వాలిటీ. కొంటే టాటా వస్తువులనే కొనాలనే ఆలోచన అందరిలో ఉంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు వ్యాపార రంగంలో భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి, వ్యాపారవేత్త రతన్ టాటా. అయితే అసలు అదంతా ఎలా సాధ్యమైంది అనే ఆలోచన మీ మనసులో వచ్చే ఉంటుంది. ఆ స్థాయిని సాధించడానికి ఆయన ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. చివరి సక్సెస్‌కు పర్యాయపదం అయ్యారు. అసలు డబ్బును ఎలా సంపాదించాలి.. దాన్ని ఎలా నిర్వహించాలని రతన్ టాటా కొన్ని సూత్రాలు చెప్పారు. వాటిలో ఓ ఐదింటిని చూద్దాం.
నైతికత ముఖ్యం :
అందరికి డబ్బు సంపాదించాలనే ఉంటుంది. డబ్బును ఎప్పటికప్పుడు వెనకేసుకోవడం ముఖ్యం. కాని అందుకు నైతిక విలువలు పాటించాలి. మన ఆర్జన న్యాయంగా ఉన్నంతకాలం మనమెప్పుడూ సక్సెస్ బాటలోనే ఉంటాం. తప్పుడు మార్గాల్లో డబ్బును సంపాదించులనుకుంటే మాత్రం వెంటనే ఎదురుదెబ్బలు తగులుతాయి. అప్పటి నుంచే పతనం ప్రారంభమవుతుంది.
తీసుకోవడమే కాదు ఇవ్వడమూ ముఖ్యమే :
మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే తిరిగి మనం అన్ని పొందగలుగుతాం. మంచి పనులు, డబ్బు ఈ రెండింటికీ ఒకటే సూత్రం. మన అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటే.. మనకు కావాలి అనుకున్నప్పుడు అది ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి నుంచి సాయంగా అందుతుంది . ఇలా చేయడం మీకు వృత్తిపరంగానూ, ఆర్థికంగానూ ఎంతో లాభం చేకూరుస్తుంది.
అవకాశాలు అందిపుచ్చుకోండి :
అన్నీ మంచిగానే జరుగుతున్నాయి అనే భావం నుంచి మనం బయటకు రావాలి. అప్పుడే ఎవరైనా ఆర్ధికంగానూ, ప్రొఫెషన్ల్గానూ వృద్ధి లభిస్తుంది. అందుకే మనకు వచ్చే అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. నిబ్బరంగా, ఎదుటివారికంటే భిన్నంగా ఉండాలి. ప్రతి రోజూ మనం చేసే పనుల గురించి మరొక్కసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనం తీసుకునే నిర్ణయాలను మనమే గౌరవించుకోవాలి :
మన తీసుకునే నిర్ణయం పట్ల మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. అది మంచా, చెడా అనేది పక్కన పెట్టండి. ఒక డెసిషన్ తీసుకునే ముందే దాని గురించి పూర్తిగా ఎనలైజ్ చేయాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఫలితాలు ఎలా ఉంటాయో ముందే నాలుగు రకాలుగా అంచనాలు వేసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే మార్చుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
పెట్టుబడులు తెలివిగా పెట్టడం ముఖ్యం :
ఒకే సంస్థలగాని, ఒకే రంగంలోగాని పెట్టుబడి పెట్టడం ఆర్థికంగా అంత అనుసరణీయం కాదు. ఎన్నో రంగాల్లో ఉన్న టాటా గ్రూపే ఇందుకు సరైన ఉదాహరణ. మన పెట్టే పెట్టుబుడులు ఎన్నో రంగాల్లో ఉండేటట్లు జాగ్రత్త పడటం అవసరం. వీటిలో కొన్నింటిలో నష్టం ఉండొచ్చు. కొన్ని సేఫ్జోన్లో ఉంటాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు ప్రయాణం కొనసాగించినప్పుడే ఆర్థికంగా మనం అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతాం.
పారిశ్రామిక మేరు నగధీరుడు - సాటిరారు ఆయనకెవ్వరూ!
జంషెడ్జీ నుంచి మాయ వరకు - టాటా ఫ్యామిలీ చేసిన వ్యాపారాలివే! - TATAs Business Journey