రామోజీ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: కిషన్‌రెడ్డి
యావత్ దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మిషన్ అని కొనియాడారు. కేంద్రం, బీజేపీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నానని అన్నారు. రామోజీ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు.