Ramayana coins : పురాతన వస్తువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల నాటి నాణేల గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి అరుదైన నాణేల సేకరిస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన వైకుంఠచారి. శ్రీరాముడు వనవాసం నుంచి పట్టాభిషేక ఘట్టాలను తెలిపే నాణెేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Goldsmith Collecting Ancient Coins In Warangal : ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. అలాంటి అభిరుచిని ఆచరణలో పెట్టే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే వరంగల్ ఎల్లమ్మ బజారుకు చెందిన వైకుంఠచారి స్వర్ణకారుడు. వారసత్వ వృత్తిని కొనసాగిస్తూనే దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి పురాతన నాణేలు సేకరిస్తున్నారు. శతాబ్దాల నాటి స్వదేశీ, విదేశీ నాణేలు సేకరించి పదిలంగా భద్రపరుస్తున్నారు.
ఓరి దేవుడా..! కోరికలు ఇలా కూడా తీర్చుకుంటారా..!!
బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలు కాకతీయుల కాలం నాటి ఘట్టాలను గుర్తుచేసే నాణేలు బంగారు వెండి నాణేలు వైకుంఠచారి వద్ద కనువిందు చేస్తున్నాయి. స్వయంగా రామభక్తుడైన చారి వనవాసం నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ ఘట్టాలను తెలియజేసే అపురూపమైన నాణేలు సేకరించి తన ఆసక్తిని చాటుకుంటున్నారు. పురాతన నాణేలనే కాకుండా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను, పోస్టల్ స్టాంపులను సైతం వైకుంఠచారి భద్రంగా దాచుకున్నారు. 25 ఏళ్ల నుంచి దాదాపు 10 వేల నాణేలు పోగుచేశానని తెలిపారు. పాఠశాలలో ప్రదర్శనకు పెడుతూ విద్యార్థులకు చరిత్రను వివరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని నాణేలు సేకరించి గత వైభవాలను నేటి తరానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు.
'' పూర్వం మూడువేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాణేలు చూసుకుంటే రామాయణం, మహా భారతం నుంచి పదహారు జనపదాల నుంచి ప్రతి దానిలో రామాయణం ముడిపడి ఉంటుంది. రాముడు, కృష్ణుడి ఎన్నో అపురూపమైన నాణేలను నేను సేకరించాను. రాముని నాణేల ద్వారా మన చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి. ఇటువంటి నాణేలకు అపురూపమైన ఆదరణ రావాలి. భవిష్యత్తులో మరిన్ని నాణేలు సేకరిస్తాను. గత వైభవాలను నేటి తరానికి తెలియజేస్తాను.'' -వైకుంఠచారి, స్వర్ణకారుడు
Ayodhya Ram Mandir Replica Made with Gold in Amrabad : ఈనెల 22న జరిగే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బంగారంతో రామ మందిరాన్ని తయారుచేసి తన భక్తిని చాటుకున్నాడు ఓ యువ స్వర్ణ కారుడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కేవలం 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవు మొత్తం 2.730 మిల్లి గ్రాములతో బంగారు భవ్య రామ మందిరాన్ని తయారు చేశాడు.