ETV Bharat / state

ఆ గ్యాంగ్ మాటలు నమ్మితే నిండా ముంచేస్తారు - 108 మందిని మభ్య పెట్టి ఏకంగా రూ.1.29 కోట్లు టోకరా - Rachakonda CP On Cheat Gang Arrest

Fraudster Gang Arrested in Hyderabad : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ ఎస్వోటీ, కీసర పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 108 మందిని మభ్య పెట్టి ఏకంగా రూ.1.29 కోట్లు దండుకున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Double Bedroom Flats Scam
Rachakonda CP On Cheating Gang Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 8:02 PM IST

Updated : Aug 23, 2024, 10:35 PM IST

Rachakonda CP On Cheating Gang Arrest : ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని.. రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తామని, సర్కారు ఉద్యోగులకు పదోన్నతలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ పలువురిని నిలువునా మోసం చేసిన ఆరుగురు సభ్యుల ఘరానా ముఠాను రాచకొండ ఎస్వోటీ, కీసర పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు మాయ మాటలతో పలువురిని మభ్య పెట్టి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు దండుకున్నారు. నిందితులు మూడు రకాల నేరాలకు పాల్పడి 108 మందిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో కుషాయిగూడకు చెందిన సురేందర్‌రెడ్డి మోసాలకు తెర తీసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు. ముఠాలోని అనుగు హర్షిని రెడ్డి తాను ఆర్డీఓ అంటూ రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తానని పలువురిని నమ్మించిందని ఆయన చెప్పారు. ఈ విధంగా 98 మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు ఇవ్వడంలో జాప్యం జరగడంతో బాధితులు వారిని ప్రశ్నించగా, ఎన్నికలు వచ్చినందున కోడ్‌ అమల్లో ఉందని అందుకే జాప్యం జరుగుతోందని ముఠా సభ్యులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.

"ఉద్యోగాలు, బదిలీల పేరిట పలువురిని మోసం చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశాం. ఒకటి కాదు రెండు కాదు ముఠా 108 మంది బాధితులను మోసం చేసినట్టు గుర్తించాం. ఈ ఫ్రాడ్​లో మొత్తం రూ. 1.29 కోట్లు దోచినట్లు మేము నిర్దారించాం. ముఠాలోని ప్రధాన నిందితుడు కొందరు అధికారులకు ఫోన్‌ చేసి వేంనరేందర్‌రెడ్డి లాగా మాట్లాడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది."- సుధీర్‌బాబు, రాచకొండ సీపీ

తీగ లాగితే డొంక కదలింది : కొందరికి రెండు పడక గదులు కేటాయించినట్టు నకిలీ మంజూరు పత్రాలు కూడా నిందితులు అందజేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో తనకు బాగా పరిచయముందని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా ఇప్పిస్తానని ప్రధాన నిందితులు సురేందర్‌రెడ్డి పలువురిని నమ్మించి రూ.18.5 లక్షలు దండుకున్నట్టు సీపీ సుధీర్‌బాబు మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో పాటు నిందితులను మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమను బదిలీ చేయాలని సంప్రదించారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయలు నిందితులు స్వాహా చేశారు.

ప్రధాన నిందితుడు సురేందర్‌రెడ్డి దాదాపు కోటి రూపాయలతో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించినట్టు సీపీ వివరించారు. అయితే గురుకులాల కార్యదర్శికి నిందితులు విషయం తెలిసింది. వీరు మోసం చేస్తున్నారని కార్యదర్శికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా తీగ లాగితే డొంక కదలింది. ముఠా ఆగడాలు మొత్తం బయటపడ్డాయి. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 98 నకిలీ రెండు పడక గదుల మంజూరు పత్రాలు, ఆర్డీఓ నకిలీ రబ్బరు స్టాంపులు, రూ.1.97 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

'మీకు అమౌంట్​ ట్రాన్స్​ఫర్​ చేస్తా - లిక్విడ్​ క్యాష్​ ఇవ్వరా' - ఇలా ఎవరైనా అడిగితే తస్మాత్ జాగ్రత్త

పార్ట్​ టైమ్ జాబ్స్​ పేరిట మీకూ ఇలాంటి వాట్సాప్ కాల్స్ వచ్చాయా? - అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే - Part Time Job Scam in hyderabad

Last Updated : Aug 23, 2024, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.