ETV Bharat / state

'దేశం ఉన్నంత వరకు పీవీ పేరు శాశ్వతం - ఆయన సేవల్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి' - KTR Tribute to PV Narasimha Rao

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 1:49 PM IST

PV Narasimha Rao Birth Anniversary Celebrations : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్​సీఆర్​టీ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళి అర్పించారు. భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్‌ అన్నారు. గత బీఆర్ఎస్​ హయాంలో పీవీ శతజయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామని చెప్పారు.

PV Narasimha Rao Birth Anniversary Celebrations
BRS Leader KTR Tribute to PV Narasimha Rao (ETV Bharat)

BRS Leader KTR Tribute to PV Narasimha Rao : మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్​సీఈఆర్​టీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్​లో ఆయనకు నివాళులు అర్పించారు. కేటీఆర్ తో పాటు పీవీ కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రులు జగదీశ్​ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తదితరులు అంజలి ఘటించారు.

బహుభాషా కోవిదుడు - ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీ : అసమాన తెలివితేటలు, బహుభాషా ప్రజ్ఞాపాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడిన కేటీఆర్, భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ప్రధానిగా తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని, పీవీకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని తెలిపారు. 16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారని కేటీఆర్ అన్నారు.

"ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చెరువు చెందేవిధంగా, తాను పెద్ద భూస్వామ్యకుటుంబం నుంచి వచ్చినా, తన సొంత భూమి 800 ఎకరాలు ఆనాడు భూసంస్కరణల్లో భాగంగా ప్రభుత్వానికి దారాధత్తం చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు పీవీ నరసింహారావు. తరువాత విద్యారంగంలో మంత్రిగా ఒకసారి అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి ఇవాళ పిల్లల భవిష్యత్​కు బంగారు బాట వేసిన సంస్కరణశీలి ఆయనే." -కేటీఆర్​, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న నిత్య విద్యార్థి : తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారని, దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న నిత్య విద్యార్థి పీవీ అందరికీ ఆదర్శమని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో పీవీ శతజయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామన్న కేటీఆర్, పీవీ ఘనమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నెక్లెస్ రోడ్డుకు ఆయన పేరు పెట్టినట్లు వివరించారు. వెనకబడిన ప్రాంతమని చెప్పుకునే రోజుల్లోనే తెలంగాణ నుంచి ఒక అపర మేధావిగా, అపర చాణక్యుడిగా, అద్భుతమైన రాజకీయ నాయకుడిగా సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని పీవీ చక్కదిద్దారని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు.

PV Narasimha Rao Jayanthi 2024 : పీవీకి భారతరత్న దక్కడం, ఆయన సేవలను దేశం గుర్తించడం మొత్తం తెలంగాణకే గౌరవమని అన్నారు. పీవీని సమాజం మర్చిపోతుందని అనుకుంటున్న సమయంలో శతజయంతి ఉత్సవాలను కేసీఆర్ ఘనంగా నిర్వహించారని వాణీదేవి పేర్కొన్నారు. పీవీ ఘనత, ఖ్యాతి మరోమారు ప్రపంచానికి తెలిసేలా చేశారని కేసీఆర్​కు కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ నరసింహారావు'

సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా - పీవీ ప్రస్థానం సాగిందిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.