Public Grievance Redressal System in AP : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పని చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే 'సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి, నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదు' అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ప్రక్షాళన : నూతన ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై సీఎం దృష్టి సారించారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులు అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు సీఎంఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సమర్థులైన అధికారులను, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగులు ఇచ్చేలా ఆలోచనలు చేశారు. వైఎస్సార్సీపీ అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు.
నన్ను జైలుకు పంపినందుకు నేను చేయబోయేది ఇదే : ఏపీ సీఎం చంద్రబాబు - AP CBN Fires IAS And IPS
స్పందన పేరు మార్పు : గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'స్పందన' కార్యక్రమానికి ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ' ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ'గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP Goverance Changed : 'పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్' పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లును హెచ్చారించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ' ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ' తక్షణమే అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు నాయుడు శర వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పలువురు అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.