ETV Bharat / state

బియ్యం బంగార మాయనే - రాష్ట్రంలో సామాన్యులకు హడలెత్తిస్తోన్న ధరలు - Rice Price Hike in Telangana - RICE PRICE HIKE IN TELANGANA

Public Facing Problems With Rice Price Hike : బియ్యం, దేశంలో నిత్యం ఎక్కువ మంది తీసుకునే ఆహారపదార్థాలో ప్రధానమైనది. అలాగే బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పండించే వారిలోనూ భారత్‌ రెండవ స్థానంలో ఉంది. అయినా పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు చుక్కలు చూస్తున్నారు. మెున్నటి వరకు కూరగాయల రేట్లతో అల్లాడిన జనం, ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదలతో సతమతం అవుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా బియ్యం రేట్లు పెరిగాయి. మరి, ఈ ధరలు నిజంగానే కొరత ఉండి పెరిగాయా? లేక వ్యాపారులు దళారులుగా మారి సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారా? కేంద్రం కట్టడి చేసిన ఎందుకీ పరిస్థితి? అసలేంటి ఈ ధరల పెరుగుదలకు కారణం? ఈ కథనంలో చూద్దాం.

What is Effect of Rice Price Hike
Public Facing Problems With Rice Price Hike
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 7:46 PM IST

బియ్యం బంగార మాయనే - రాష్ట్రంలో సామాన్యులకు హడలెత్తిస్తోన్న ధరలు

Public Facing Problems With Rice Price Hike : మునుపెన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు బియ్యం కొనుగోలు చేయాలంటే హడలిపోతున్నారు. ఇంతకు ముందు రాష్ట్రంలో చాలా మంది రేషన్‌ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించి, సన్నాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్‌ బియ్యాన్ని(Ration Rice) వినియోగించుకుంటున్నారు. సాధారణ బియ్యం క్వింటా ధర సగటున 1000 నుంచి 1500 రూపాయల వరకు పెరిగింది.

గతంలో కిలో 50 రూపాయల చొప్పున విక్రయించే సన్న బియ్యాన్ని, ప్రస్తుతం 65 నుంచి 70 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక మేలు రకం రూ.80 ఉంది. సాధారణంగా ఏటా కొత్త బియ్యం వచ్చే సమయానికి ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడాది రబీ పంట చేతికొచ్చినా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అతివృష్టి, అనావృష్టితో ధాన్యం దిగుబడులు తగ్గి, ధరలు పెరిగాయని రైస్‌ మిల్లర్ల నిర్వాహకుల నుంచి వినిపిస్తున్న మాటలు.

Telangana Rice Price Rise : రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు భగ్గుమంటుంటే కొందరు వ్యాపారులు మాత్రం అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కొంతమంది దళారులు నేరుగా రైతుల వద్ద సన్న వడ్లను కొని బియ్యంగా మార్చి నిల్వచేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఏర్పడే డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. గత కొద్ది రోజులుగా గోదాముల్లో నిల్వ చేస్తూ ధర పెరుగుదలకు కారణమవుతున్నారు.

రేషన్​ బియ్యానికి బదులుగా డబ్బులు.. కిలోకు రూ.34 ఇస్తామన్న ప్రభుత్వం

ప్రస్తుతం నాణ్యమైన కేజీ బియ్యం 80 రూపాయాలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ఎక్కువగా లభించే సన్న రకాలైన సోనామసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ క్వింటాలు బియ్యం ధర గతంలో 3,500 నుంచి 4,000 రూపాయలు మధ్య ఉండేది. ప్రస్తుతం వాటిని 5 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. క్వింటాలు 4,500 నుంచి 5 వేల రూపాయల మధ్య ఉండే మేలు రకం బియ్యం ధర ప్రస్తుతం రూ.6,500 చేరింది. క్వింటాలు పాత బియ్యం ధర 7,500 రూపాయలకు పెరిగింది. 25 కిలోల ఫైన్‌ క్వాలిటీ బియ్యం బస్తాను రూ.1700 నుంచి 1800 మధ్య విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌ ధరలు పెరగడంతో నగరంలో రిటైల్‌ వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తా వద్ద సగటున 200 రూపాయల వరకు పెంచేశారు.

What is Effect of Rice Price Hike : బియ్యం ధరల పెరుగుదలను మరికొందరు వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. ఒకే రకమైన బియ్యాన్ని వివిధ బ్రాండ్లుగా మార్చి విక్రయిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఇటీవలే దేవ్‌పల్లి టాటానగర్‌లో జరిపిన సోదాల్లో అక్రమ నిల్వలున్నాయని(Illegal Reserves), ఆ బియ్యం పలు రకాల బ్రాండ్ల పేరిట ప్యాక్‌ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించి మైలార్‌దేవ్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ బియ్యం అయోధ్య, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ నుంచి నగరానికి తరలిస్తున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అంతర్‌రాష్ట్ర రవాణా, బియ్యం నిల్వకు సంబంధించి ఫిబ్రవరిలో వచ్చిన కొత్త మార్గదర్శకాలు పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి పలు రకాల బియ్యంతో కలిపి సంచుల్లో నింపి మార్కెట్‌కి తరలిస్తున్నారు. హోటళ్లు, రిటైల్‌ వ్యాపారులు బియ్యం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగదారుల అభిప్రాయాలు సేకరించి ఫిర్యాదులు ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Rice Price Hike Today : నిత్యవసరాల ధరలను రోజూ పర్యవేక్షిస్తూ ధరలు పెరిగినప్పుడు నియంత్రనకు సలహాలు ఇవ్వాల్సిన ఆహార సలహా సంఘం ఉనికిలోనే లేని పరిస్థితి. స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతోనే ఎఫ్​ఏసీ సమావేశాలు నిర్వహించడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. దీంతో ఆయా గోదాముల్లో తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్‌ను శాసిస్తున్నారు అనేది ప్రజల వాదన. ప్రధానంగా రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పాతనగరానికి ఆనుకొని ఉన్న గోదాముల్లో ఈ బియ్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీల్లో ఇటీవల వెల్లడైంది.

గోదాములకు బియ్యం తరలించే క్రమంలో టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌, పౌరసరఫరాలశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఏటా రేషన్‌ డీలర్లు(Ration Dealers), నల్లబజారుకు తరలిస్తున్నవారిపై 6ఏ, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నామని పౌరసరఫరాలశాఖ చెబుతోంది. ఏడాది కాలంలో మూడు జిల్లాల్లో రేషన్‌ డీలర్లపై 60, మరో 350 మందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. నల్లబజారుకు తరలించిన 750 మందిపై 6ఏ కేసులు, 300 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అయినా పరిస్థితిలో మార్పులు కనిపించడం లేదు.

Rice Price Hike Day by Day in Telangana : బియ్యం ధరల పెరుగుదలకు వరిసాగు తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వరిసాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రాష్ర్టాల్లో వరదల కారణంగా భారీగా పంటనష్టం సంభవించింది. ఇక మన రాష్ట్రంలో అయితే గత వానకాలంలో తగిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలలు అడుగంటాయి. ఫలితంగా ఈ రబీలో సన్నాల సాగు భారీగా తగ్గింది.

'భారత్​ రైస్​' రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలి : రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం

ఇది అంతిమంగా బియ్యం ధరలపై ప్రభావం చూపిస్తున్నదని వ్యాపారులు చెబుతున్నారు. వానాకాలంలో మొత్తం సాగులో 50 శాతం సన్నాలు ఉంటుండగా, ఈసారి మాత్రం 30 శాతానికే పరిమితమైందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం గత సంవత్సరంలోనే ఎగుమతులను నిషేధించింది. దీనివల్ల దేశీయంగా బియ్యం సరఫరా పెరుగుతుందని, ఫలితంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా ఉంటోందని భావించింది. అయితే దీన్నే అదునుగా చేసికుని వ్యాపారులు దళారులుగా మారి ప్రజల సొమ్ములను కాజేస్తున్నారు.

Telangana Rice Price Update : పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో సన్నరకాల బియ్యం సాగు కొంచెం తక్కువే. ఆ పండించే కొద్ది బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా దళారులు కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు అమ్ముకుంటున్నారు. సన్న బియ్యం స్టాక్‌ అంతా వ్యాపారుల గుప్పిట్లోనే ఉండడంతో వచ్చే రోజుల్లో బియ్యం ధరలు మరింతగా పెరగనున్నాయి.

అయితే ప్రభుత్వం ఇప్పటికైనా ముందు చూపుతో వ్యవహరించి, ఆక్రమాలకు పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే ఆహార సలహా సంఘం ఏర్పాటు చేసి అక్రమ నిల్వలు, మోసాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో బియ్యం ధరలను అదుపు చేస్తే సామాన్యులకు మేలు జరుగుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

పోహా vs రైస్​- ఆరోగ్యానికి ఏది బెటర్​? - poha or rice which is better

కేంద్రం గుడ్​న్యూస్- రూ.29కే కిలో బియ్యం- వచ్చే వారం మార్కెట్​లోకి భారత్ రైస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.