ETV Bharat / state

ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ - Governor Quota MLC Appointment - GOVERNOR QUOTA MLC APPOINTMENT

Kodandaram and Amir Ali Khan sworn in as MLCs : గవర్నర్​ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం దక్కగా, వారితో ఇవాళ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు.

Governor Quota MLC Appointment in Telangana
Kodandaram and Amir Ali Khan sworn in as MLCs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 10:57 AM IST

Updated : Aug 16, 2024, 1:23 PM IST

Kodandaram and Amir Ali Khan sworn in as MLCs : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు. మండలి సభ్యుల నియామకం‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించడంతో ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. ఈ మేరకు టీజేఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్ కుమారుడు జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించారు.

మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్​ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Professor Kodandaram Speech After MLC Sworn : తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని ఆచార్య కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని అన్నారు. అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు.

"ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండా మీదకు తీసుకురాగలిగాను. మండలిలో సభ్యులుగా కావడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతతో ఉద్యమకారుల‌, ప్రజల, అమరుల ఆకాంక్షల‌ మేరకు పని చేస్తాను. అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ద్ధించింది. తెలంగాణ రాష్ట్రం రావ‌డం వ‌ల్ల‌నే మాకు ఈ గుర్తింపు దక్కింది." -కోదండరాం, ఎమ్మెల్సీ

సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2023 జులైలో చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్‌ తమిళిసై రద్దు చేయడం జరిగింది.

తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్​ ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం ధర్మాసనం తాజాగా స్టే ఉత్తర్వులిచ్చింది. ఆ స్థానాల్లో కొత్తవారి భర్తీని నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కొత్తవారి నియామకాలను ఆపలేమని తేల్చిచెప్పింది.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి ఊరట - హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే - SC STAY ON TELANGANA MLC ELECTION

వచ్చే ఏడాది 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు - ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ ప్రకటన - MLC Voter List Revision in TG

Last Updated : Aug 16, 2024, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.