ETV Bharat / state

డేంజర్ డెంగీ - జ్వరంతో కవల పిల్లలతో నిండు గర్భిణి మృతి - Pregnant woman died in Hanmakonda - PREGNANT WOMAN DIED IN HANMAKONDA

Pregnant Woman died in Hanmakonda : ఇంటికి పండంటి పాపాయిలు వచ్చే ఆనంద గడియల కోసం, ఆ కుటుంబం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మరో వారం రోజుల్లో ఆ ముచ్చట తీరుతుందనే లోపు విధి వారిని చిన్నచూపు చూసింది. డెంగీ భూతానికి నిండు గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవల శిశువులూ కన్నుమూశారు. హనుమకొండ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యలు తీరని శోకంలో మునిగారు.

PREGNANT WOMAN DIED IN SAYAMPETA
Pregnant Woman died in Hanmakonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 2:33 PM IST

Pregnant Woman died in Hanmakonda : నవమాసాలు మోస్తూ మాతృత్వం కోసం ఎదురుచూస్తున్న ఆ మహిళకు 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. విధి వక్రీకరించడంతో తల్లితో పాటు గర్భంలోనే కవలలు చనిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే శాయంపేట మండలం గట్లకనపర్తికి చెందిన శిరీష నిండు గర్భిణి. మరో వారం, పది రోజుల్లో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు.

తీరని విషాదం: డెంగీ జ్వరంతో గర్భిణీ మృతి (ETV Bharat)

ఇంతలోనే డెంగీ బారిన పడడంతో కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో పరిస్థితి విషమించింది. కడుపులోని కవలపిల్లలనైనా బతికించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. కానీ విధి వక్రీకరించడంతో తల్లితోపాటు, కడుపులోనే కవల శిశువులూ కన్నుమూశారు.

పండంటి పిల్లలు పుడతారనుకునే సమయంలో జరిగిన విషాదంతో, శిరీష భర్త కన్నీరు మున్నీరయ్యారు. శ్రీకాంత్‌ మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె సోదరి శిరీషను 2021లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శిరీష కూడా అకాల మరణం చెందడంతో తీరని శోకంలో మునిగిపోయారు.

Dengue Fever : వానకాలంలో సీజనల్​ వ్యాధులతోపాటు ముఖ్యంగా అందరినీ కలవపరిచే విషయం డెంగీ జ్వరం. చాలావరకు ఇది మామూలుగా తగ్గే జ్వరమైనా, రక్తకణాల సంఖ్య పడిపోవటంతో కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతోంది. మరణాలు సంభవిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి డెంగీ జర్వం రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, కళ్ల వెనక నుంచి నొప్పి, వాంతి, వికారం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, రక్తంలో హిమటోక్రిట్‌ (హిమోగ్లోబిన్‌) ఎక్కువవటం, అదే సమయంలో ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోవటం, కడుపు నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ జ్వరం తెలుసుకోవాడానికి నిర్ధారణ పరీక్షలు అవసరం. జ్వరం వచ్చిన మొదటి 1-5 రోజుల్లో, ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష పరీక్ష చేయించాలి. ఒకవేళ రిజల్ట్​ పాజిటివ్‌గా వచ్చినట్లయితే డెంగీ ఉన్నట్టే.

డెంగీ వచ్చాక ఇబ్బందులు పడటం కన్నా రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు. డెంగీ దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. కాబట్టి ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, డబ్బాలు వంటివి ఉంటే వెంటనే తొలగించేయాలి. ఇంట్లోకి దోమలు రాకుండా మెష్​ బిగించుకోవాలి.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌ - అక్కడికక్కడే ముగ్గురి దుర్మరణం - Three killed in Khammam accident

బాలుడి పాలిట యమపాశమైన టైరు - మూత్ర విసర్జన చేస్తుండగా? - boy died hit by a vehicle tire

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.