ETV Bharat / state

వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ - సునీతా ప్రశ్నలకు ఎందుకు నోరు మెదపడం లేదు?

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 2:05 PM IST

Prathidwani Debate on Viveka Daughter Sunitha Press Meet: ఏ హత్య కేసునైనా సాధారణంగా పోలీసులు నాలుగైదు రోజుల్లో తేల్చేస్తారు. కాని మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుతం సీఎం బాబాయ్‌ అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని వివేకా కుమార్తె సునీతా ప్రశ్నించారు. సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చలేదు. ఇవే ప్రశ్నలు వివేకా కుమార్తె సునితారెడ్డి సంధించారు.

Viveka Daughter Sunitha Press Meet
YS Sunitha Reddy Sensational Comments on CM Jagan

Prathidwani Debate on Viveka Daughter Sunitha Press Meet: సాధారణంగా ఏ హత్య కేసునైనా పోలీసులే నాలుగైదు రోజుల్లో తేల్చేస్తారు. అసలు నేరస్తులను అరెస్ట్ చేస్తారు. వైఎస్‌ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు ఆయన మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుతం సీఎం(CM Jagan) బాబాయ్‌ సొంత ఇంట్లో అత్యంత కిరాతకమైన పద్దతిలో వివేకాను హత్య చేసి ఐదేళ్లవుతోంది. ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చలేదు. ఇవే ప్రశ్నలు వివేకా కుమార్తె సునితారెడ్డి సంధించారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ తన చెల్లెలు సునీతారెడ్డి ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు అనేది నేటి ప్రతిధ్వని చర్చ. చర్చలో ఎం.సుబ్బారావు (న్యాయ నిపుణులు), ఎన్‌.చక్రవర్తి (వివేకా కేసుపై పరిశోధకులు), రవిశంకర్‌రెడ్డి (రాజకీయ విశ్లేషకులు) పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మా నాన్నని వాళ్లే చంపారు - అప్పట్లో మాకు అర్థం కాలేదు : వైఎస్​ సునీత

YS Sunitha Reddy Sensational Comments on CM Jagan : వివేకానందరెడ్డి కుమార్తె సునితారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం జగన్‌ నుంచి ఎందుకు జవాబు రావట్లేదని ఎం.సుబ్బారావు ప్రశ్నించారు. సునీత చెప్పినట్లు మనమధ్యే తిరుగుతున్న ఆ హంతకులు ఎవరయి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy), భాస్కర్‌రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారా? అని అన్నారు. హత్య జరిగిన రోజు జగన్ సొంత ఛానెల్‌ సాక్షిలో గుండెపోటుతో మృతి అని గంటలపాటు ప్రసారం చేశారు. విజయసాయిరెడ్డి మీడియాకు అదే చెప్పారు.

గొడ్డళ్లతో నరికిచంపిందే కాకుండా రక్తపు మరకలు తుడిచేశారు. హంతకులను పచ్చిగా సమర్థిస్తున్న జగన్‌ విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కేసులో ఏఏ అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఎన్‌.చక్రవర్తి అన్నారు. సీబీఐ విచారణ పిటిషన్‌ను జగన్‌ ఎందుకు వెనక్కి తీసుకున్నారు. జగన్ దంపతులను సీబీఐ విచారించే అవకాశం కానీ, విచారించాల్సిన అవసరం కానీ ఉందా అని అన్నారు.

సీబీఐ మీదే కడప జిల్లాలో ఎదురు కేసులు : వివేకా హత్య కేసులో హంతకులను విడిచిపెడితే సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది పేదలకు-పెత్తందార్లు పోరాటం అంటున్న జగన్ ఓ ఆడబిడ్డ ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతుంటే ఎందుకు అడ్డు తగులుతున్నారని అన్నారు. వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యకు సూత్రధారులు ఎవరు ఎందుకు ఈ కేసు ముందడుగు పడట్లేదని సునితారెడ్డి అడుగుతున్నారని రవిశంకర్‌రెడ్డి అన్నారు. సీబీఐ పేరు చెబితేనే దేశంలో అందరూ ఉలిక్కిపడతారు. అలాంటి సీబీఐ మీదే కడప జిల్లాలో ఎదురు కేసులు పెట్టించారు.

సీబీఐ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయటానికి వస్తే కర్నూలులో చుట్టుముట్టి సీబీఐని వట్టిచేతులతో పంపించారు. వాళ్లకి ఎక్కడిది అంత ధైర్యం మంచికి, చెడుకు రాబోయే ఎన్నికల్లో యుద్ధం అని జగన్ అంటున్నారు. ఒంటరిపోరాటం చేస్తున్న చెల్లెలు సునితపై, ఆమె భర్తపై సాక్షిలో తప్పుడు రాతలు రాయించటం మంచా సొంత చిన్నన్నను చంపిన హంతకులను కాపాడుతున్న జగన్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అన్నారు.

తెలంగాణలో మెగా, ఆంధ్రాలో దగా డీఎస్సీ - జగన్నాటకంలో ఆవిరైపోయిన టీచర్ పోస్టులు

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.