Praneeth Rao Case Update Latest : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై, రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండో రోజు విచారణ చేపట్టింది. ఉదయం నుంచి ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పోలీసులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు. స్టేషన్ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.
ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన ప్రణీత్‌రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయనను కస్టడీకి కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 23 వరకు 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో ఆదివారం నుంచి ఆయనను విచారిస్తున్నారు. తొలి రోజు విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - ప్రణీత్ రావు సహా మరికొంత మందిపై కేసు నమోదు
Praneeth Rao Case Update Latest : 7 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ప్రణీత్ రావును ఆధారాల ధ్వంసం విషయంపై పోలీసులు ప్రశ్నించారు. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదులో భాగంగా ప్రణీత్ రావు కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఐఎంఈఐ నెంబర్లు, ఐపీ అడ్రెస్సుల వివరాలు వ్యక్తిగత పరికరాల్లో కాపీ చేసుకుని ధ్వంసం చేశాడని పేర్కొన్నారు.
Praneeth Rao Case Key Information in Custody : ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రణీత్‌రావు కాపీ చేసుకున్న డిజిటల్ పరికరాలు ఎక్కడ ఉంచాడనే అంశంపై అతణ్ని పోలీసులు ప్రశ్నించారు. దీనికి ప్రణీత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం ప్రణీత్‌రావు వద్ద పని చేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. వారు చెప్పిన అంశాలకు అనుగుణంగా ప్రణీత్ నుంచి మరికొన్ని విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?
మరోవైపు ప్రణీత్‌రావు కస్టడీలో ఉండగానే ఎస్‌ఐబీలోని కార్యాలయానికి వెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తోంది. అతనికి కేటాయించిన కంప్యూటర్లను పరిశీలించనున్నారు. ఆధారాలు ధ్వంసం చేసిన రోజు సీసీ టీవీ కెమెరాలు ఆఫ్ చేశారని అధికారులు గుర్తించగా, ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎలక్రీషియన్‌ను కూడా విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న సమయంలో మీడియా కంటపడకుండా పోలీసులు అతన్ని రహస్య ప్రదేశానికి తరలించారు. విచారణ అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రణీత్ కస్టడీ విచారణను డీసీపీ విజయ్‌కుమార్, సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించినట్టు తెలుస్తోంది.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్‌పై కోర్టులో వాదనలు!
ఈ నెల 23 వరకు ప్రణీత్‌రావు కస్టడీ - తొలి రోజు విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు