ETV Bharat / state

అప్పుడే పీక్​లో సమ్మర్ హీట్ - విద్యుత్ వినియోగంలో హైదరాబాద్​ ఆల్‌టైమ్‌ రికార్డ్ - Power Usage Increased In Hyderabad - POWER USAGE INCREASED IN HYDERABAD

Power Consumption Increased In Hyderabad : గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండలు మండుతున్న వేళ గ్రేటర్​లో గురువారం రికార్డు స్థాయిలో రికార్డులు నమోదయ్యాయి. దీంతో గతేడాది మే నెలలో విద్యుత్ వినియోగం రికార్డులను ఈ నెల మార్చిలోనే బద్దలు కొట్టింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా తీరుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని విద్యుత్​శాఖ అధికారులు వెల్లడించారు.

Power Consumption Increased In Greater
Power Consumption Increased In Greater
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 2:01 PM IST

Power Consumption Increased In Hyderabad : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గ్రేటర్​లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. వేసవి తాపం కారణంగా అమాంతం విద్యుత్ వినియోగం(Energy Consumption) పెరిగింది. దీంతో గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ సంవత్సరం మార్చిలోనే బద్దలు కొట్టింది. 2023లో మే 19న అత్యధికంగా 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. అయితే మార్చి 28న 79.48 మిలియన్​ యూనిట్ల వినియోగంతో పాత రికార్డులు చెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయానికి విద్యుత్ వినియోగం 67.97 మిలియన్​ యూనిట్లే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి గ్రేటర్​లో విద్యుత్​ వినియోగం గణనీయంగా పెరిగింది.

23 శాతం వరకు పెరుగుదల : గత ఏడాది మార్చి నెలలో సరాసరి విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు నమోదవ్వగా అది ఈ ఏడాది 70.96 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే సుమారు 22.7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది వేసవిలో విద్యుత్తు వినియోగం అధికారుల అంచనాలకు మించి నమోదవుతుంది. మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా 83-85 మిలియన్ యూనిట్ల వరకు ఉండొచ్చని అధికారులు మొదట్లో అంచనాలు వేశారు. ఇప్పుడు వాడుతున్న తీరును పరిశీలిస్తే 90 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. విద్యుత్​ డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేవిధంగా అదనపు లైన్లు, ట్రాన్స్​ఫార్మార్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.

Electricity Usage in Hyderabad Increased : విద్యుత్​ సరఫరా తీరుపై ప్రతీరోజూ ఉదయం 8.30 గంటలకు సీజీఎంలు, ఎస్​ఈలతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. విద్యుత్ డిమాండ్- సరఫరాలో అంతరాయాలపై, సిబ్బంది హాజరు లాంటి రిపోర్టులను పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు.

వారానికి ఓ సారి సీజీఎం, ఎస్​ఈలు విధిగా బస్తీల్లో, కాలనీల్లో పర్యటించాలని సీఎండీ ఆదేశించారు. పీక్ అవర్స్​ ముగిసేంత వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు విధుల్లో అన్ని విభాగాల సంబంధిత అధికారులు ఉండాలని ఆదేశించారు. 212 సెక్షన్లలోని ఫ్యూజ్​ ఆఫ్ కాల్ సెంటర్లలో 800 మంది ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉంటున్నారని అధికారులు వెల్లడించారు.

ఎండల నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, ఏసీల వాడకం - భారీగా పెరుగుతోన్న విద్యుత్ వినియోగం

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. రాష్ట్ర చరిత్రలో రెండోసారి

ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.