ETV Bharat / state

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూపు - A Poor Family Waiting For Helping Hands - A POOR FAMILY WAITING FOR HELPING HANDS

A Poor Family Waiting For Helping Hands : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయమే వారికి జీవనాధారం. ఇంతలో కుటుంబ యజమానికి ఒక్కసారిగా ఆరోగ్యం పాడయింది. అతడి లివర్ పూర్తిగా దెబ్బతినడంతో కాలేయమార్పిడి చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని తెలిసి ఆ నిరుపేద కుటంబం తల్లడిల్లుతోంది. ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తోంది.

A Poor Family Waiting For Helping Hands
A Poor Family Waiting For Helping Hands (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 2:10 PM IST

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చూపు! (ETV Bharat)

A Poor Family Waiting For Helping Hands : ఓ కుటుంబ యజమానికి అనుకోని ఆపద వచ్చింది. కాలేయం పూర్తిగా పాడైందని లివర్ మార్పిడి చికిత్స చేస్తే తప్ప బతకలేడని వైద్యులు చెప్పారు. అందుకు రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిరుపేద కుటుంబం తల్లడిల్లుతోంది. ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని ఆ కుటుంబం కోరుతోంది.

పేదకుటుంబానికి పెద్దకష్టం : హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన దేవరకొండ రాజశేఖర్​కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కుట్టు మిషన్ కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఉన్నంతలో పిల్లల్ని చదివించుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. అనుకోకుండా ఆరు నెలల క్రితం రాజశేఖర్‌కి ఒంట్లో బాగలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వారికి షాక్​ లాంటి వార్త తెలిసింది.

ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్న కుటుంబం : రాజశేఖర్​కు లివర్‌ పూర్తిగా పాడైందని కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని, అంత డబ్బు తమ వద్ద లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉందని రాజశేఖర్‌ భార్య వాపోయింది. మందులు కొనడానికే నెలకు 7వేల రూపాయల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం, దాతలు తమను ఆదుకోవాలని రాజశేఖర్‌ కుటుంబం వేడుకుంటోంది.

"నా భర్తకు అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్తే లివర్​ పూర్తిగా పాడైందని వైద్యులు చెప్పారు. కాలేయాన్ని మార్చేందుకు రూ.30 లక్షలవరకు ఖర్చువుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకే కవరేజ్​ అవుతుందని వైద్యుల ద్వారా తెలిసింది. ఆరోగ్యశ్రీ లేకుండా రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. అంతడబ్బు చెల్లించే స్తోమత మాకు లేదు. ప్రతి నెల మందులకే ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాను"- కల్పన, బాధితుడి భార్య

ఆ ఇంటి పెద్దకు పెద్ద కష్టం.. కావాలి ఆపన్నహస్తం

చిన్నప్రాణం.. పెద్దగండం.. మా బిడ్డను బతికించండి సారూ..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.