ETV Bharat / state

రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? - బీజేపీపై పొన్నం ఫైర్ - minister ponnam fires on bjp

Minister Ponnam fires on BJP : రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దుయ్యబట్టారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తే, ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

LOK SABHA ELECTIONS 2024
Minister Ponnam fires on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 3:20 PM IST

Updated : Apr 12, 2024, 3:56 PM IST

Minister Ponnam fires on BJP : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam) ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తే, ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

కరవును స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు - ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ - Ponnam Prabhakar Fires On KCR

చేనేతలకు బీజేపీ(BJP) ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ ప్రభుత్వాలు రైతులకు పదేళ్లు ఏం చేశాయి? అని పొన్నం నిలదీశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Lok Sabha Elections 2024 : కేంద్రప్రభుత్వం ఒక్క విభజన హామీ నెరవేర్చ లేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. 7మండలాలు, విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పజెప్పారన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యయని ఆయన నిలదీశారు. బీజేపీకి ఎజెండా లేదని దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షాలు దేశంలో నవరత్నాల కంపెనీలు అమ్ముతున్నారని, బీజేపీ దళితులకు, బీసీలకు, మైనారిటీలకు వ్యతిరేకమని ఆరోపించారు.

శ్రీరాముడి పేరున అక్షింతలు, కుంకుమ ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తాను గెలిచిన సికింద్రాబాద్‌కు ఏమి చేశాడని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు అండగా ఉన్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయలేదని, అమరుల బలిదానాలను అవహేళన చేశారని దుయ్యబట్టారు.

"రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రానికి కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా ఇచ్చారా? వారు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదు. చేనేతలకు బీజేపీ అన్యాయం చేసింది. తెలంగాణ అమరవీరులను అవమానపరిచింది". - పొన్నం ప్రభాకర్, మంత్రి

రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? - బీజేపీపై పొన్నం ఫైర్

పేదింటి తలుపు తట్టిన పొన్నం - అగ్రనేత మాటిచ్చింది - మంత్రి పాటించాడు! - Minister Ponnam Met Poor family

బీఆర్​ఎస్​ హయాంలో చేనేతలకు ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువే ఇస్తాం : పొన్నం ప్రభాకర్​ - Minister Ponnam on Handloom Workers

Last Updated : Apr 12, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.