ETV Bharat / state

దశాబ్దిలోనే శతాబ్దకాల అభివృద్ధి - తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ ప్రముఖుల శుభాకాంక్షలు - TELANGANA FORMATION DAY WISHES 2024 - TELANGANA FORMATION DAY WISHES 2024

Telangana Decade Celebrations Wishes 2024 : రాష్ట్ర ప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు సాగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పదేళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని, దశాబ్దం గడిచిన సందర్భమిది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు మహోజ్వల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

Telangana Formation Day 2024
Telangana Formation Day 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 9:48 AM IST

Updated : Jun 2, 2024, 9:58 AM IST

Telangana Formation Day Wishes 2024 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ప్రజలకు గులాబీ దళపతి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల కోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ఠ పరుచుకుంటూ సమర్థంగా పాలన అందించి రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు.

KTR Wishes On TG Formation Day 2024 : నాడు కరవు, రాళ్లురప్పల కల్లోలిత రాష్ట్రం పది సంవత్సరాల్లో పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణగా మారిందని బీఆర్ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని, దశాబ్దం గడిచిన సందర్భమిదని పేర్కొన్నారు. ఆధునిక భారతం కళ్లరా చూసిన, మరో స్వాతంత్య్ర పోరాటం తెలంగాణ ఉద్యమమని కేటీఆర్ గుర్తు చేశారు.

బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదని కేటీఆర్‌ పేర్కొన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రమని చెప్పారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి, మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ అని తెలిపారు. 60 ఏళ్ల విధ్వంస గాయాలను, పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి అని వివరించారు. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే, మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలి : తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందనేలా అనితర సాధ్యంగా ఈ దశాబ్ద ప్రయాణం సాగిందని కేటీఆర్ తెలిపారు. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు, పది సంవత్సరాల్లోనే మన తెలంగాణ చేసి చూపిందని చెప్పారు. నాడు కరవు, రాళ్లురప్పల, కల్లోలిత రాష్ట్రం నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణగా మారిందని అన్నారు. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని, రాష్ట్రం దేశానికి దిక్సూచిగా కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Harish Rao Tweet on TG Formation Day : అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడోనని తెగించి కొట్లడగా, స్వరాష్ట్రం సిద్ధించిన రోజు ఇవాళని చెప్పారు. తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని హరీశ్‌రావు వివరించారు.

దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని, సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలిపింది బీఆర్ఎస్‌ పార్టీ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండుగ చేసి, విద్యుత్ రంగాన్ని పటిష్ఠం చేయడంతో పాటు విద్యా రంగాన్ని ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని అగ్రస్థానానికి చేర్చినట్లు వివరించారు. పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని హరీశ్‌రావు వెల్లడించారు.

శభాష్ తెలంగాణ అని దేశం మెచ్చుకునేలా : కరువుల బాధలు లేకుండా చేసింది వలసలు వాపస్ తెచ్చామని హరీశ్‌రావు పేర్కొన్నారు. పంట పొలాలను సస్యశ్యామలం చేశామని, ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చేసి శభాష్ తెలంగాణ అని దేశం మెచ్చుకునేలా చేసినట్లు వివరించారు. ఈ అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి ఇక మీదట కూడా ఉండాలని, రాష్ట్రం దేశానికి రోల్ మెడల్‌గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహర్లు అంటూ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Venkaiah Naidu Wishes To TG Decade Celebrations : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలంగాణకు మహోజ్వల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని చెప్పారు. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రమని అన్నారు.విభిన్న రంగాల్లో సుస్థిరాభివృద్ధికి చిరునామా అని చెప్పారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ కీలక భూమిక పోషించాలని, అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరాలని వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా ఆకాక్షించారు.

అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది సంబురం - అమరులకు నివాళులతో ప్రారంభం - TELANGANA FORMATION DAY 2024

Last Updated : Jun 2, 2024, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.