Police Solved Miyapur Murder Case : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తేదీన జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్పందన హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్పందన స్నేహితుడే అయిన మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మియాపూర్ సీఐ రామలింగ దుర్గ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం దీప్తిశ్రీనగర్‌లోని సీబీఆర్ ఎస్టేట్స్‌లో ఉండే బండి స్పందన అనే మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
స్పందన కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించగా ఈ క్రమంలోనే స్పందన క్లాస్‌మేట్ అయిన మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. చదువుకునే రోజుల్లోనే మనోజ్ కుమార్, ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డేవాడని, కానీ స్పందన అంగీకరించకుండా స్నేహితులుగానే ఉందామని చెప్పింది. తర్వాత స్పందన స్పందన తన స్నేహితుడు వినయ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
స్పందన, మనోజ్ కుమార్‌లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా కలిసి ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా భర్త వినయ్ కుమార్‌తో గొడవల కారణంగా అతనికి దూరంగా ఉంటున్న స్పందన, వేరే స్నేహితులతో చనువుగా ఉంటూ మనోజ్ కుమార్‌ను సైతం దూరం పెట్టింది. ఈ విషయంపై స్పందనతో రెండు, మూడు సార్లు మనోజ్ గొడవ పడ్డాడు. తనకు దూరంగా ఉంటుందని మనసులో పెట్టుకొన్న మనోజ్ ఎలాగైనా స్పందనను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 30న స్పందన ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. స్పందనతో పెళ్లి విషయంమై గొడవ పడ్డాడు. ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న బండరాయి, స్క్యూ డ్రైవర్‌తో పొడిచి దారుణంగా హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు మనోజ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
భర్తతో విడాకుల కేసు : 2022 ఆగస్టులో స్పందనకు వినయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.
మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య - అతడి పనేనా? - Software Woman Murdered in Miyapur