ETV Bharat / state

వల్లభనేని కోసం మూడు బృందాలు గాలింపు - ఇప్పటికే వంశీ అనుచరులు అరెస్ట్ - Police Searching for Vamsi - POLICE SEARCHING FOR VAMSI

Police Searching for Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్‌లో మూడు బృందాలతో పోలీసులు గాలించారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే దాడికి చెందిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వంశీ అనుచరులను అరెస్టు చేశారు.

police_searching_for_vamsi
police_searching_for_vamsi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:43 PM IST

Updated : Aug 3, 2024, 7:42 AM IST

Police Searching for Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ఇప్పటికే ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు, ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా రమేష్, యూసఫ్ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిలో రమేష్ ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. యూసఫ్​ను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

వంశీ కోసం హైదరాబాద్‌లో మూడు బృందాలతో పోలీసులు గాలించారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే దాడికి చెందిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సహా, కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు వంశీ సహా పలువురి కదలికలపై నిఘా ఉంచారు.

శుక్రవారం మధ్యాహ్నం వంశీని అరెస్టు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని పోలీసులు కొట్టిపారేశారు. మరోవైపు వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్​లో ఉన్నారా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే దానిపై లోతుగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాల్ డేటా , సహాయకుల కదలికలను నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు వంశీ సతీమణి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారని సమాచారం.

వంశీ ప్రోద్బలంతోనే దాడి: దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైఎస్సార్​సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ కోసం పోలీసులు హైదరాబాద్‌, గన్నవరం తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అక్కడి పోలీసులు వంశీ సొంత మనుషులుగా చెలామణి అయ్యారు. వంశీ అనుయాయులుగా ఉన్న పోలీసులు కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తప్పుడు పత్రాలతో మా భూములు లాక్కున్నారు -​ ప్రజాదర్బార్​లో వల్లభనేని వంశీ బాధితులు - Complaints on Vallabhaneni Vamsi

వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే దాడి కేసులో పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పార్టీ శ్రేణుల్ని వేధించడం, యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు.

3 ప్రత్యేక బృందాలు: ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు - YSRCP Ministers Used Bad Words

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం - వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా? - TDP Office Attack Case Updates

Last Updated : Aug 3, 2024, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.