ETV Bharat / state

రేపటి నుంచి హైదరాబాద్​లో కఠిన ఆంక్షలు - ఈ పనులు చేస్తే జైలుకెళ్లడం ఖాయం - LOK SABHA POLL RESTRICTIONS IN HYD

author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:52 AM IST

Updated : May 10, 2024, 11:33 AM IST

Lok Sabha Election 2024 Restrictions : మరో రెండు రోజుల్లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో పోలీసులు హైదరాబాద్​లో ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు ఈనెల 11 సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024 Restrictions (ETV Bharat)

Lok Sabha Election 2024 Police Restrictions : హైదరాబాద్​లో లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ ముగ్గురు పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్​ రోజున పోలింగ్​ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

ఆంక్షలు : పోలింగ్​ పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడొద్దని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నా మద్యం విక్రయాలపై ఆంక్షలుంటాయన్నారు. 13వ తేదీన పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండాలని, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మాత్రమే ఉంటాయని తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని సీపీలు హెచ్చరించారు.

ఎన్నికల ఆంక్షలు :

  • ఐదుగురు మించకుండా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్లడానికి వీల్లేదు.
  • మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం నిషేధం.
  • బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలకు అనుమతి లేదు.
  • వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధం.
  • పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధం.
  • ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించడంపై నిషేధం.
  • మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలూ మూసేయాలి.

మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్​ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. జూన్​ 4న ఓట్ల లెక్కింపు రోజున సాయంత్రం 5 గంటల వరకు మూసి వేయాలని ఆదేశించారు. ఒకవేళ రీపోలింగ్​ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్​ శాఖకు సీఈవో స్పష్టం చేసింది.

లోక్​సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - సైబరాబాద్ పరిధిలో రూ. 3.16కోట్ల సొత్తు స్వాధీనం - Huge Amount Of Money Seized

లోక్​సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు - విధుల్లో 6వేల మంది సిబ్బంది : సీపీ తరుణ్‌జోషి - Rachakonda CP Interview

Last Updated : May 10, 2024, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.