ETV Bharat / state

అదనపు కమిషనర్లు ఎక్కడ? - నగరంలో నెలలుగా ఖాళీగా ఉంటున్న కీలక పోస్టులు - POLICE OFFICER APPOINTMENTS ISSUE - POLICE OFFICER APPOINTMENTS ISSUE

Police Officer Appointment Issue in Hyderabad commissionerate : రాజధానిలోని రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు 4 నెలలుగా అదనపు కమిషనర్లు లేకుండానే కొనసాగుతున్నాయి. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పోస్టు దాదాపు నెల నుంచి ఖాళీగానే ఉంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు కావడంతో వీటి భర్తీకి మరిన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

Police Officer Appointment Issue
Police Officer Appointment Issue in Hyderabad commissionerate
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 11:39 AM IST

Police Officer Appointment Issue in Hyderabad commissionerate : హైదరాబాద్​లోని మూడు పోలీస్‌ కమిషనరేట్లలో కీలక విభాగాలు సారథుల్లేకుండానే కొనసాగుతున్నాయి. అదనపు, సంయుక్త కమిషనర్లు, డీసీపీ పోస్టులు నెలల పాటు ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పోస్టు దాదాపు నెల రోజుల నుంచి ఖాళీగానే ఉంది. విశ్వప్రసాద్‌ బదిలీ తర్వాత పోలీస్ శాఖ ఎవరినీ నియమించలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలె అధికారులకు ఆదేశించారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్‌ కమిషనర్ లేకపోవడం ఇబ్బందికరం.

పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి

అదనపు కమిషనర్లు ఎక్కడ? : రాష్ట్రంలో శాంతి భద్రతలు, పాలనాపరమైన వ్యవహారాల పర్యవేక్షణలో అదనపు సంయుక్త కమిషనర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు 4 నెలలుగా అదనపు కమిషనర్లు లేకుండానే నెట్టుకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైబరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ అవినాశ్‌ మహంతిని కమిషనర్‌గా నియమించింది. రాచకొండలో 2022 డిసెంబరులో అదనపు కమిషనర్‌ డి.సుధీర్‌ బాబు హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు.

ఆ స్థానంలో అప్పటి కరీంనగర్‌ కమిషనర్‌ సత్యనారాయణ వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ఎన్నికల సంఘం సత్యనారాయణ స్థానంలో అంబర్‌ కిషోర్‌ ఝాను నియమించింది. రోజుల వ్యవధిలోనే ఈయనను బదిలీ చేసి, ప్రభుత్వం తరుణ్‌ జోషిని నియమించింది. కొద్ది రోజుల్లోనే మల్టీ జోన్‌-2 ఐజీగా వెళ్లారు. మళ్లీ ఆయననే కమిషనర్‌గా నియమించింది. అదనపు కమిషనర్‌ పోస్టు మాత్రం నాలుగు నెలలుగా ఖాళీగానే ఉంది.

Police Transfers in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల వేళ స్పెషల్‌ బ్రాంచి విభాగానికి ప్రాధాన్యముంటుంది. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు చేరవేస్తుంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ 3 నెలలకు పైగా ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అనురాధ బదిలీపై వెళ్లాక ఇన్‌ఛార్జి డీసీపీతోనే కొనసాగుతోంది.

సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీగా శిల్పవల్లిని నియమించి కొద్ది రోజుల్లోనే మార్చారు. సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ కొత్తపల్లి నరసింహకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మాదాపూర్‌ ట్రాఫిక్‌ డీసీపీ హర్షవర్ధన్‌ ఎన్నికల వేళ బదిలీపై వెళ్లాడంతో మేడ్చల్‌ డీసీపీ డీవీ శ్రీనివాసరావును ఇన్‌ఛార్జిగా నియమించారు. తాజాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలుకావడంతో వీటి భర్తీకి మరిన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

పోలీస్ శాఖలో వరుస బదిలీలు - కేసుల దర్యాప్తులో తగ్గుతోన్న పురోగతి

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.