ETV Bharat / state

నీకు బైక్​ కావాలా స్కూటీయా? - ఇవి వాహనాలు కాదు చిన్నారుల విక్రయానికి కోడ్​వర్డ్స్​ - Child Trafficking Case in Hyderabad

Child Selling Gang Case Updates : రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్‌ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల్ని విక్రయించేవారని తేలింది. మరోవైపు రక్షించిన చిన్నారుల్లో తమ వారు ఉన్నారేమోనని రెండు తెలుగు రాష్ట్రాలనుంచి పోలీసులకు ఫోన్లు వస్తున్నాయి.

Child Selling Gang Case Updates
Child Selling Gang Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 9:42 AM IST

Child Trafficking Case in Hyderabad Updates : తెలంగాణలో చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్న రాకెట్‌ను పోలీసులు చేధించిన తెలిసిందే. అయితే ఇప్పుడు రక్షించిన పిల్లల్లో తమ వారు ఉన్నారేమోనని అంటూ ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. కన్నబిడ్డల ఆనవాళ్లను చెబుతూ, వారిని నిర్ధారించి అప్పగించాలని అర్థిస్తున్నారు.

Hyderabad Police Caught Interstate Child Selling Gang : రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు పిల్లల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్‌ చేసి 16 మంది చిన్నారుల్ని రక్షించారు. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు తమ చిన్నారులు ఏమైనా ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 మంది పోలీసులకు ఫోన్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఆయా వివరాలతో తమ వద్దకు రావాలని పోలీసులు వారికి సూచనలు చేస్తున్నారు. మరోవైపు కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్‌ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బైక్‌ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల! : పిల్లల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు నిర్ధారించారు. వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను రవాణా చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు మహిళా ఏజెంట్లు తల్లుల్లా వారిని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా విక్రయాల విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు కోడ్‌భాష ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. స్కూటీ అంటే ఆడపిల్ల, బైక్‌ అంటే మగ అని పలుకుతారు.

కొనుగోలు చేసే వారి నుంచి డబ్బు తీసుకుని తేదీ నిర్ణయిస్తే చాలు నెలల వయసున్న శిశువులను రెండు, మూడు రోజుల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాటలు కలిపి, తమకు తెలిసినవారి వద్ద నెలల వయసున్న పిల్లలు ఉన్నారని చెబుతూ విక్రయాలు సాగిస్తున్నారు.

కొత్తవారిని చూసి ఏడుస్తున్న చిన్నారులు : మరోవైపు పోలీసులు తాము రక్షించిన 16 మంది పిల్లల్లో 14 మందిని చిన్నారుల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. మరో ఇద్దరి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం శిశువిహార్‌ సంరక్షణలో ఉన్న మొత్తం 14 మందికి బుధవారం అక్కడి సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతివెస్లీ, మేడ్చల్‌ సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ రాజారెడ్డి శిశువిహార్‌కు వెళ్లి వారిని పరిశీలించారు. కొత్త ప్రదేశం కావడంతో కొందరు పిల్లలు కొత్త వారిని చూసి ఏడుస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటారనే భావనతో అధికారులు ఉన్నారు.

కేసును సుమోటోగా తీసుకున్న ఎస్‌సీపీసీఆర్‌ : మరోవైపు చిన్నారుల అక్రమ రవాణా, దత్తత కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎస్‌సీపీసీఆర్‌) సుమోటోగా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, అక్రమ రవాణా రాకెట్‌ వెనుక ఎవరున్నారో గుర్తించి, చర్యలు తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఎస్‌సీపీసీఆర్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు ఇచ్చారు.

కోడ్​ భాషలో సంభాషణ - సొంత తల్లిలా నటించే మహిళలు - చిన్నారుల అక్రమ రవాణాలో విస్తుపోయే విషయాలు - CHILD TRAFFICKING GANG IN HYDERABAD

చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - 16 మందిని కాపాడిన పోలీసులు - Child Kidnap Gang Arrest In TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.