ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసు - కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు - Chargesheet Filed in Phone Tapping - CHARGESHEET FILED IN PHONE TAPPING

ChargeSheet Filed in Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి కోర్టులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, ఛార్జిషీట్‌లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కేసులో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరగా, బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి న్యాయస్థానం స్పష్టం చేసింది.

Police Filed ChargeSheet on Phone Tapping Case
ChargeSheet Filed in Phone Tapping Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 7:46 PM IST

Updated : Jun 11, 2024, 10:26 PM IST

Police Filed ChargeSheet on Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. 68 పేజీల ఛార్జ్‌షీట్‌లో పోలీసులు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చగా వీరిలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్టు సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు, సస్పెండైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌లో ఉన్నట్టు అందులో వివరించారు.

69 మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగపత్రంలో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞనంతో కూడిన అంశాలుండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మరో నిందితుడిని విచారించాక మరిన్ని ఆధారాలతో పూర్తి అభియోగపత్రం దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సామాన్యమైన విషయం కాదు - వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డమే : హైకోర్టు

Phone Tapping case Update : ఎస్‌ఐబీలో ఆధారాలు ధ్వంసమైయ్యాయని ఆ విభాగం అదనపు ఎస్పీ రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో మార్చి 10న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి బాధ్యుడిగా పేర్కొంటూ ఎస్‌ఐబీలో పనిచేసే డీఎస్పీ ప్రణీత్‌రావును సస్పెండ్‌ చేశారు. మార్చి 13న అతన్ని అరెస్టు చేశారు. అతని విచారించిన సందర్భంలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. కేసు కీలకంగా మారడంతో వెస్ట్​ జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరిని నియమించారు.

ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా - దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌

ఇతర నిందితుల పాత్రపైన ఆధారాలు లభించడంతో వారిని కూడా అరెస్టు చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో నాలుగు నెలలు పాటు దాదాపు 1200 ఫోన్లను నిందితులు ట్యాప్‌ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. బీఆర్​ఎస్​ను గెలిపించడం కోసమే ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో నిందితులు ట్యాపింగ్‌ చేసినట్టు తేలింది. రాజకీయ నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను నిందితులు ట్యాప్‌ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది.

ASP's Bail Petitions : మరోవైపు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఈ కేసులో మరింత దర్యాప్తు జరగాల్సి ఉన్నందున వారికి బెయిల్‌ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టుకు తెలిపారు.

రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని నిందితుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా అనేక అంశాలపై విచారించాల్సింది ఉందని తిరుపతన్న, భుజంగరావుకు బెయిల్‌ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, బుధవారం తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

56 మంది ఎస్​వోటీ సిబ్బందితో - సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్​ చేశాం : ప్రణీత్​రావు

Last Updated : Jun 11, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.